ఇరు దేశాల వ్యూహాత్మక భాగస్వామ్యానికి పిలుపు
భారత్-ఇండోనేషియా మధ్య బలమైన వ్యూహాత్మక భాగస్వామ్యం రెండు దేశాల శ్రేయస్సుకే కాకుండా ప్రాంతీయ, ప్రపంచ శాంతి, స్థిరత్వానికి ఎంతో దోహదపడుతుందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. ఇండోనేషియా రాజధాని జకార్తాలోని పార్లమెంటును ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. శతాబ్దాల నాటి సాంస్కృతిక బంధాలు ఉన్న ఇరు దేశాలు ఒకే రకమైన ప్రజాస్వామ్య విలువలు, పరస్పర నమ్మకం, ఉమ్మడి భవిష్యత్ దార్శనికతను పంచుకుంటున్నాయని ప్రధాని పేర్కొన్నారు. తీవ్రవాదానికి వ్యతిరేకంగా , ప్రాంతీయ భద్రతను దెబ్బతీసే ఏకపక్ష చర్యలకు వ్యతిరేకంగా ఉమ్మడి పోరాటం చేయాల్సిన అవసరం ఉందని ఆయన నొక్కిచెప్పారు. రక్షణ, నౌకాదళ భద్రత, సైబర్ సెక్యూరిటీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), యూపీఐ (UPI) వంటి డిజిటల్ పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ రంగాల్లో సహకారాన్ని మరింత విస్తరించాలని ప్రధాని మోదీ ఆకాంక్షించారు.
No comments:
Post a Comment