Showing posts with label #SupremeCourt #ElectionCommission #CECAct2023 #LegalNews #ChiefJusticeOfIndia #IndianConstitution #BreakingNews2026 #DemocraticValues. Show all posts
Showing posts with label #SupremeCourt #ElectionCommission #CECAct2023 #LegalNews #ChiefJusticeOfIndia #IndianConstitution #BreakingNews2026 #DemocraticValues. Show all posts

Monday, 12 January 2026

ఎన్నికల కమిషనర్లకు 'రక్షణ కవచం'పై సుప్రీంకోర్టు విచారణ



  •  కేంద్రం, ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసిన సీజేఐ ధర్మాసనం

న్యూఢిల్లీ: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) , ఎన్నికల కమిషనర్లకు 2023 నాటి కొత్త చట్టం ద్వారా కల్పించిన ప్రత్యేక రక్షణను (Immunity) సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌ను విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకరించింది. భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్య కాంత్. జస్టిస్ జాయ్‌మాల్య బాగ్చీలతో కూడిన ధర్మాసనం ఈ వ్యవహారంపై కేంద్ర ప్రభుత్వానికి, కేంద్ర ఎన్నికల సంఘానికి నోటీసులు జారీ చేసింది. అయితే, ఈ రక్షణ కల్పించే నిబంధనపై స్టే ఇచ్చేందుకు మాత్రం న్యాయస్థానం నిరాకరించింది. 'లోక్ ప్రహరి' అనే స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన ఈ పిటిషన్, 2023 నాటి సీఈసీ చట్టంలోని సెక్షన్ 16 రాజ్యాంగబద్ధతను ప్రశ్నిస్తున్నది.


ఈ పిటిషన్ ప్రకారం.. సదరు సెక్షన్ 16 ద్వారా ఎన్నికల కమిషనర్లకు అసాధారణమైన, మితిమీరిన అధికారాలను కట్టబెట్టారని, ఇది వారికి సివిల్, క్రిమినల్ చర్యల నుంచి శాశ్వత రక్షణ కల్పిస్తున్నదని పిటిషనర్ వాదించారు. ఒకవేళ వారు తమ పదవిని దుర్వినియోగం చేసినట్లు ఆరోపణలు వచ్చినా, వారిపై ఎటువంటి విచారణ జరపకుండా ఈ నిబంధన అడ్డుకుంటుందని పిటిషన్‌లో పేర్కొన్నారు. రాజ్యాంగబద్ధమైన పదవుల్లో ఉండేవారు జవాబుదారీగా ఉండాలని, ఇటువంటి రక్షణ కవచం ప్రజాస్వామ్యస్ఫూర్తికి విరుద్ధమని పిటిషనర్ కోర్టు దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై పూర్తి వివరాలతో సమాధానం ఇవ్వాలని కోరుతూ సర్వోన్నత న్యాయస్థానం సంబంధితవర్గాలను ఆదేశించింది.

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...