- రాజ్యాంగాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కాంగ్రెస్ పోరాటం కొనసాగిస్తుంది:
- యూపీ కాంగ్రెస్ చీఫ్ ఆరాధనా మిశ్రా 'మోనా'
దిల్లీ: దేశంలో ఓట్ల తొలగింపు, ఓట్ల చోరీ అంశం ఇకపై కేవలం కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సమస్య మాత్రమే కాదని, అది రాజ్యాంగాన్ని నమ్మే ప్రతీ ఒక్కరి ఆందోళన అని ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆరాధనా మిశ్రా 'మోనా' స్పష్టం చేశారు. దేశంలో నిష్పక్షపాతంగా ఎన్నికలు నిర్వహించాల్సిన రాజ్యాంగ సంస్థ అయిన ఎన్నికల సంఘం (ECI) తన విశ్వసనీయతను పూర్తిగా కోల్పోయిందని ఆమె తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్‌పై ఇద్దరు సీనియర్ ఎన్నికల కమిషనర్లు తీవ్ర ఆరోపణలు చేయడం దేశవ్యాప్తంగా చర్చకు దారితీసిందని పేర్కొన్నారు. లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో కాంగ్రెస్ నాయకులంతా సమావేశమయ్యారని, దేశంలోని ಪ್ರతీ పౌరుడి ఒక్కో ఓటును రక్షించడమే కాంగ్రెస్ పార్టీ బాధ్యతగా ముందుకు సాగుతుందని ఆరాధనా మిశ్రా ఉద్ఘాటించారు. స్వాతంత్ర్య ఉద్యమ కాలంలో దేశం కోసం పోరాడిన చరిత్ర కాంగ్రెస్‌ది అని, ఇవాళ రాహుల్ గాంధీ నాయత్వంలో దేశ ప్రజాస్వామ్యాన్ని, రాజ్యాంగాన్ని పరిరక్షించడానికి తాము మరో పోరాటానికి సిద్ధమయ్యామని ఆమె తేల్చిచెప్పారు.
No comments:
Post a Comment