- పట్నా చేరుకున్న లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య
పట్నా, అక్టోబర్ 2: రాష్ట్రీయ జనతా దళ్ (RJD) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమార్తె రోహిణి ఆచార్య చాలా కాలం తర్వాత బిహార్ రాజధాని పట్నాకు తిరిగి వచ్చారు. తన తండ్రి ఆహ్వానం మేరకే తాను పాట్నాకు వచ్చానని, దీనిని ఎవరూ రాజకీయ కోణంలో చూడవద్దని ఆమె మీడియాను కోరారు. చాలా రోజుల తర్వాత తాను పట్నాకు చేరుకున్నానని, ఇది పూర్తిగా వ్యక్తిగతమైన విషయమని రోహిణి స్పష్టం చేశారు. తన తల్లిదండ్రులను కలుసుకునేందుకే వచ్చానని, దీనికి ఎలాంటి రాజకీయ రంగు పులమొద్దని ఆమె విజ్ఞప్తి చేశారు. తన రాక గురించి తాను ముందే ట్వీట్ ద్వారా కూడా వెల్లడించినట్లు ఆమె గుర్తుచేశారు.
No comments:
Post a Comment