Showing posts with label #Telangana #ElectionCommission #VoterList #SIR #MaheshKumarGoud #TelanganaPolitics #ElectionReforms. Show all posts
Showing posts with label #Telangana #ElectionCommission #VoterList #SIR #MaheshKumarGoud #TelanganaPolitics #ElectionReforms. Show all posts

Tuesday, 18 August 2026

ఓట్ల తొలగింపుపై ఈసీపై మహేశ్‌కుమార్‌ గౌడ్‌ తీవ్ర ఆరోపణలు




హైదరాబాద్‌: తెలంగాణలో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ పేరుతో ఎన్నికల సంఘం నిర్దాక్షిణ్యంగా ఓట్లను తొలగించిందని టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్‌ గౌడ్‌ ఆరోపించారు. హైదరాబాద్‌లో బీఎల్‌వోలు పలువురి ఇళ్లకు వెళ్లలేదని, ముఖ్యంగా పేదలు, వలస కార్మికుల ఓట్లే ఎక్కువగా తొలగించారని అన్నారు. రాష్ట్రంలో 73 లక్షల ఓట్లను కారణం లేకుండా తొలగించారని, మరో 92 లక్షల ఓట్లు ప్రశ్నార్థకంగా మారాయని ఆయన పేర్కొన్నారు. 2002 నాటి ఓటర్ల జాబితాతో ప్రస్తుత ఓటు హక్కును ముడిపెట్టడం సరికాదని, డీలిమిటేషన్‌, పోలింగ్‌ కేంద్రాల మార్పుల కారణంగా పాత వివరాలు అందరికీ అందుబాటులో లేవని విమర్శించారు. ఎన్నికల సంఘం కేంద్ర ప్రభుత్వ ఒత్తిడిలో పనిచేస్తోందని ఆరోపించిన మహేశ్‌కుమార్‌ గౌడ్‌, ఓట్ల తొలగింపుపై ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు.

Featured post

మీ ధైర్యం ఎన్నో ప్రాణాలను కాపాడింది

ఫ్లై దుబాయ్‌ కెప్టెన్‌తో మోడీ వీడియో కాల్‌ న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్‌లో మా...