Showing posts with label CM Revanth Reddy. Show all posts
Showing posts with label CM Revanth Reddy. Show all posts

Saturday, 10 May 2025

జాబ్ క్యాలెండర్ అమలు ఎప్పుడు?

 రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాగా లేదని సీఎం రేవంత్ రెడ్డి పదే పదే చెబుతున్నారు. రిటైర్డ్ ఉద్యోగులకు చెల్లించాల్సిన నగదు కూడా లేదంటున్నారు. మరి ఏడాదిలోనే రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చి అందులో ఎన్ని ఉద్యోగాలు ఇచ్చిందో శ్వేత పత్రం విడుదల చేయాలని నిరుద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటివరకు ప్రభుత్వం అట్టహాసంగా నియామకపత్రాలు అందిస్తున్న వాటిలో ఎక్కువశాతం గత ప్రభుత్వ హయాంలోనే వచ్చిన నోటిఫికేషన్లే అని వారి వాదన. అయితే ప్రభుత్వాలు మారినా నియామక ప్రక్రియ అనేది నిరంతరంగా కొనసాగుతుందని ప్రభుత్వ చెబుతున్న మాట. సరే ఆ సంగతి పక్కనపెడితే గత ఏడాది అసెంబ్లీ వేదికగా ఆగస్టులో


జాబ్ క్యాలెండర్ ప్రకటించింది. వాటికి సంబంధించిన ఒక్క నోటిఫికేషన్ కూడా ఇప్పటివరకు విడుదల కాలేదు. కొత్త ఏడాదిలో అప్పుడే 5 నెలలు పూర్తికావొస్తున్నాయి. జాబ్ క్యాలెండర్ అమలు అంటే జనవరి టు డిసెంబర్ ఉండాలి కదా అని నిరుద్యోగులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని బూచిగా చూపెట్టి ప్రభుత్వం ఆరు గ్యారెంటీల అమలుతో పాటు ఉద్యోగాల భర్తీ అంశాన్ని మరుగున పడేసే ప్లాన్ వేస్తున్నదని మండిపడుతున్నారు.

Thursday, 10 April 2025

ఇది కదా తెలంగాణ సోయి అంటే!

 


తెలంగాణ ఉద్యమంలో రేవంత్‌ రెడ్డి పాత్ర ఏమిటి అంటే ఎవరిని అడిగినా చెబుతారు. ఆయనకు ఎన్టీఆర్ గుర్తుకు వస్తారు. ఆయన గురువు చంద్రబాబు గుర్తుకు వస్తారు. కానీ పధ్నాలుగేళ్లు ఉద్యమం చేసిన ఉద్యమనాయకుడు, పదేళ్లు సీఎంగా పనిచేసి వ్యక్తి, గుర్తుకురారు. అంతేలే.  చంద్రబాబు సూత్రధారిగా, రేవంత్‌ రెడ్డి పాత్రధారిగా తెలంగాణ ప్రభుత్వాన్ని కూల్చే ప్రయత్నాన్ని ఛేదించిన నాయకుడి పేరు తలుచుకోవాలన్నా, ఆయనతో పోల్చుకోవాలన్నా ఉద్యమకాలంలో తమరి ట్రాక్‌ రికార్డు కూడా సక్కగ లేదాయే. అందుకే ప్రపంచంలో అన్ని విషయాల గురించి మాట్లాడుతారు కానీ తెలంగాణ విషయానికి వస్తే ఎక్కడ కేసీఆర్‌ పేరు ప్రస్తావించాల్సి వస్తుందోనని అతి తెలివితో అర్థంపర్థం లేని మాటలు మాట్లాడి అభాసుపాలవడం మీకు అలావాటుగా మారింది. తెలంగాణ విషయంలో ఫణికర మల్లయ్యకు ఉన్న చైతన్యం కూడా లేకపాయే. ఏం కావాలి అని మీ గురువు చంద్రబాబు అడిగితే మరో మాట లేకుండా తెలంగాణ కావాలన్నడు. ఇది కదా తెలంగాణ సోయి అంటే!

Thursday, 20 February 2025

కాంగ్రెస్‌ బీసీ సీఎం.. పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యల వెనుక?


బీసీలకు రాజ్యాధికారం ఇవ్వాలని రాహుల్‌ గాంధీ నిర్ణయం తీసుకున్నారు. ఏదో ఒకరోజు తెలంగాణ రాష్ట్రానికి బీసీ సీఎం అవుతారు. అది కాంగ్రెస్‌ పార్టీలోనే అవుతారు.  వచ్చే ఎన్నికలన్నీ బీసీల చుట్టే తిరుగుతాయి. ఈ ఐదేళ్లు  రేవంత్‌ రెడ్డే సీఎంగా కొనసాగుతారు. రానున్న రోజుల్లో మాత్రం బీసీలకే ఈ అవకాశం ఉంటుంది.- గాంధీభవన్‌లో మీడియా సమావేశంలో పీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌ గౌడ్‌ చేసిన వ్యాఖ్యలు

ఆ మధ్య పదేళ్లు నేనే సీఎం అని రేవంత్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. అదే మాటను ఆయన పదే పదే ఉటంకించారు. గతంలో ఒకే పార్టీకి రెండు సార్లు అవకాశం ఇచ్చారని 1994-2014 వరకు ఉమ్మడి రాష్ట్రాన్ని పాలించిన పార్టీల గురించి 2014-2023 వరకు బీఆర్‌ఎస్‌ పాలనను ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారు. అందుకే  మాకు కూడా ప్రజలు మరోసారి అవకాశం ఇస్తారని, కాబట్టి వచ్చే ఐదేళ్లూ సీఎం సీటు నాదేనని స్పష్టంగానే చెప్పారు. కానీ ఇటీవల కాంగ్రెస్‌ పార్టీలో జరిగిన పరిణామాలతో సీఎం స్వరం మారింది. మంత్రులు, అధికారులు తనకు సహకరించడం లేదని, కొంతమంది మంత్రులు తన సీటుపై కన్నేశారని వార్తలు వచ్చాయి. సీఎం పోస్టుపై పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యలు వచ్చే ఎన్నికల తర్వాత జరగబోయే పరిణామాలను అంచనా వేశారు. కానీ రాష్ట్రంలో మళ్లీ అధికారంలోకి వస్తామన్న విశ్వాసం ఆ పార్టీ నేతలు, కార్యకర్తల్లోనే లేదు. కాబట్టి వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గెలువడం, సీఎం సీటు బీసీలు రాహుల్‌ గాంధీ ఇస్తారని మహేశ్‌కుమార్‌ చెప్పినట్లు జరిగే అవకాశాలు 10 శాతం కూడా లేవు. 

కొన్నిరోజులుగా కాంగ్రెస్‌ పార్టీలో జరుగుతున్న పరిణామాలు, సీఎం రేవంత్‌ రెడ్డి వ్యాఖ్యల్లో సడలుతున్న నమ్మకం వంటివి బేరీజు వేసుకుని ఏదో జరుగుతున్నదన్న చర్చ రాజకీయవర్గాల్లో జరుగుతున్నది. ఈ నేపథ్యంలోనే పీసీసీ చీఫ్‌ బీసీలదే సీఎం సీటు అని వ్యాఖ్యానించడం కొంత ఆలోచనలో పడేసింది. ఎందుకంటే రాష్ట్రవ్యవహారాల ఇన్‌ఛార్జిగా దీపాదాస్‌ మున్షీ తప్పించి రాహుల్ గాంధీ విధేయురాలైన మీనాక్షి నటరాజన్ నియమించారు. అది కూడా రాహుల్‌తో సీఎం రేవంత్‌ రెడ్డి భేటీ తర్వాత జరిగిన పరిణామాం ఇది. మీనాక్షి నియామకం తర్వాతే రాష్ట్ర వ్యవహారాలన్నీ పార్టీ హైకమాండ్‌ తమ చేతుల్లోకి తీసుకున్నదనే వాదనలు వినిపిస్తున్నాయి. తాజాగా బీసీలకు రాహుల్‌ రాజ్యాధికారం ఇవ్వాలని నిర్ణయించారని పీసీసీ చీఫ్‌ వ్యాఖ్యలు వీటికి కొనసాగింపుగానే భావించాలి.

Tuesday, 4 February 2025

ప్రజాపాలన వద్దు, ఫామ్‌హౌస్‌ పాలనే కావాలె

పనిమంతుడు పందిరి వేస్తే.. కుక్కతోక తగిలి కూలిపోయిందట.. అట్లనే ఉన్నది రేవంత్‌రెడ్డి పాలన. గత ప్రభుత్వంపై పదేళ్లలో రానంత వ్యతిరేకత ఏడాది ప్రజాపాలనపైనే వచ్చింది. ఎన్నికలకు ముందు మార్పు కోరుకున్న జనాలే మాకొద్దు ఈ బుల్డోజర్‌ పాలన అంటూ రోడ్లెక్కారు. ప్రజాస్వామ్యం, హక్కుల అంటూ ప్రసంగాలు దంచిన రేవంత్‌ రెడ్డే ఇప్పుడు నిరసనలు, ఆందోళనలు సమావేశాలుపై ఉక్కుపాదం మోపుతున్నారు. ప్రశ్నిస్తే కేసులు.. హామీలు అడిగితే అరెస్టులు. 



బీఆర్‌ఎస్‌ ఉండదు, కేసీఆర్‌ను ఆనవాళ్లు కనిపించకుండా చేస్తానని గప్పాలు కొట్టిన ఎనుముల రేవంత్‌రెడ్డికి కాంగ్రెస్‌ పార్టీ సొంత హ్యాండిల్‌లో పెట్టిన సర్వేలో దిమ్మతిరిగే షాక్‌ ఇచ్చారు. తామేదో ప్రజాపాలన సాగిస్తున్నట్లు.. కేసీఆర్‌ పాలన ఫామ్‌ హౌస్‌ పాలన అన్నట్టు ప్రచారం ఆ పోల్‌ పెట్టారు. దీంతో 70 శాతానికి పైగా జనాలు మాకు ప్రజలు లేని ప్రజాపాలన వద్దు, ప్రజా సంక్షేమాన్ని కోరుకునే కేసీఆర్‌ పాలనే కావాలని కుండబద్దలు కొట్టారు. దీంతో ఆగమైన హస్తం పార్టీ నేతలు హడావుడిగా ప్రెస్‌మీట్లు పెట్టి తూచ్‌ ప్రజలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవానికి ఆ పోల్‌ పెట్టామని, బీఆర్‌ఎస్‌, బీజేపీ వాళ్లు కలిసి మా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓట్లు వేశారని నాలుక మడతేశారు. ఇంకా నాలుగేళ్లు ఉండగా.. ఇప్పుడే ప్రజాభిప్రాయం ఎందుకు అంటే సమాధానం ఉండదు.ట్విట్టర్ పోల్ ప్రామాణికం కాదు అన్నప్పుడు పార్టీ ఆఫీషల్ అకౌంట్లో  పోల్ ఎందుకు పెట్టారంటే సప్పుడు లేదు. 

Saturday, 18 May 2024

మేడిగడ్డ పునరుద్ధరణ బాధ్యత నిర్మాణ సంస్థదే


మేడిగడ్డ బ్యారేజీ కుంగిన ఘటనలో పునరుద్ధరణ పనులను నిర్మాణ సంస్థే చేయాల్సి ఉండగా ఎందుకు చేయడం లేదు? పని పూర్తి కాకుండానే సర్టిఫికెట్‌ ఇచ్చిన ఇంజినీర్లపై చర్యలు ఎందుకు తీసుకోలేదు? అని సీఎం రేవంత్‌రెడ్డి ప్రశ్నించారు. సాగు నీటి శాఖపై సచివాలంలో చేసిన సమీక్షలో పలు ప్రశ్నలు సంధించారు. 'పని పూర్తయితే, నిర్మాణ సంస్థ గడువు పొడిగించాలని ఎందుకు కోరింది? నీటి పారుదల శాఖ ఎందుకు పొడిగించింది? నిర్మాణ సంస్థ సంస్థపైన, బాధ్యులైన ఇంజినీర్లపై ఎందుకు చర్యలు తీసుకోలేదు? మొత్తం రికార్డులన్నీ పరిగణనలోకి తీసుకుని నిర్మాణ సంస్థతోనే పని చేయించాలి అని సీఎం స్పష్టం చేశారు. 


నేషనల్‌ డ్యాం సేఫ్టీ అథార్టీ (ఎన్డీఎస్‌) ఇచ్చిన మధ్యంతర నివేదిక, వానకాలంలో చేయాలని సూచించిన పనుల గురించి నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి ముఖ్యమంత్రి దృష్టి తీసుకొచ్చారు. ఈ సమీక్షలో ఉత్తమ్‌తో పాటు మంత్రులు పొంగులేటి, తుమ్మల, కొండా సురేఖా ఉన్నారు. అయితే ఎన్డీఎస్‌పై సుదీర్ఘ చర్చ చేసినట్టు సమాచారం. బ్యారేజీ కుంగుబాటులో బాధ్యులపై క్రిమినల్‌ చర్యలకు వెనకాడవద్దనీ సీఎం స్పష్టం చేసినట్టు సమాచారం. వచ్చే వారం ప్రాజెక్టు వద్దకు సీఎం వెళ్లనున్నారు. 


Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...