Monday, 5 October 2026

సుప్రీంకోర్టు స్పందనపై కార్తీ చిదంబరం హర్షం

 


  • ఈసీ పనితీరు, ఫారం 6, ఎస్‌ఐఆర్ వివాదంపై తీవ్ర విమర్శలు

న్యూఢిల్లీ, అక్టోబర్ 5:ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) జ్ఞానేశ్ కుమార్ విధులకు ఆటంకం కలిగించేలా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ, కోర్టు తాజా వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ ఎంపీ కార్తీ చిదంబరం సానుకూలంగా స్పందించారు. సుప్రీంకోర్టు జోక్యంతో ఎట్టకేలకు న్యాయస్థానం 'సొమ్మసిల్లిన అంతరాత్మ మేల్కొందని' ఆయన వ్యాఖ్యానించారు. ఎన్నికల సంఘం (ECI) పనితీరుపై పౌరసమాజంలో, రాజకీయ వర్గాల్లో తీవ్ర ఆందోళనలు వ్యక్తమవుతున్నాయని పేర్కొన్నారు.

  • ఈ సందర్భంగా ఆయన లేవనెత్తిన ప్రధాన అంశాలు

• ఏకపక్ష నిర్ణయాలపై అనుమానాలు: ఎన్నికల సంఘం రాజ్యాజ్యంగా నడుస్తోందా? లేదా నిర్ణయాలు ఏకాభిప్రాయం, మెజారిటీతో జరుగుతున్నాయా? లేక సీఈసీ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని, ఒకవేళ అదే జరిగితే ఈసీ తీసుకునే ప్రతి నిర్ణయం చట్టవిరుద్ధం అవుతుందని కార్తీ చిదంబరం ఆరోపించారు.

• మినహాయింపుల ఎస్‌ఐఆర్ (SIR): ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియ అనేది ఓటర్లను చేర్చడం కోసం కాకుండా, ప్రజలను ఓటు హక్కుకు దూరం చేసేలా (Exclusionary process) ఒక కుట్రపూరితంగా అమలు చేస్తున్నారని మండిపడ్డారు. 

• ఫారం 6లో మార్పులు: కొత్త ఓటర్ల నమోదుకు ఉపయోగించే 'ఫారం 6' ఫార్మాట్‌లో తల్లిదండ్రులు, తాతాబామ్మల ఓటింగ్ చరిత్ర గురించిన ప్రశ్నలు అడగడాన్ని ఆయన తప్పుబట్టారు. ఎవరి ఓటు హక్కయినా వారి తల్లిదండ్రులు లేదా పూర్వీకుల ఓటింగ్ ఆధారంగా ఉండదని స్పష్టం చేశారు. ఈ మార్పులను ఎవరు, ఎవరి అనుమతితో చేశారని సుప్రీంకోర్టు కూడా ప్రశ్నించడం గమనార్హమని పేర్కొన్నారు. 

• ఫారం 7 దుర్వినియోగం: కర్ణాటకలో ఓట్ల తొలగింపు కోసం ఫారం 7ను దుర్వినియోగం చేస్తున్నారని, బీజేపీకి చెందిన ఒకరే వేల సంఖ్యలో అభ్యంతరాలు దాఖలు చేశారని ఆరోపించారు. సంవత్సరాలుగా ఓటు హక్కు వినియోగించుకుంటున్నవారిపై అనామకంగా ఫిర్యాదులు చేయడం సరైంది కాదన్నారు. ప్రస్తుత ఎన్నికల సంఘం పనితీరుపై ప్రజల విశ్వాసం సడలిపోయిందని కార్తీ చిదంబరం తీవ్ర విమర్శలు గుప్పించారు.



No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...