Showing posts with label #KTR #KCR #RevanthReddy #BRS #TelanganaPolitics #Congress #Telangana. Show all posts
Showing posts with label #KTR #KCR #RevanthReddy #BRS #TelanganaPolitics #Congress #Telangana. Show all posts

Tuesday, 8 September 2026

కేసీఆర్‌ ఇంటిపై దాడికి కాంగ్రెస్‌ గూండాలను తీసుకెళ్తున్నారా?: కేటీఆర్‌




హైదరాబాద్‌: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గూండాలతో కలిసి మాజీ సీఎం, బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.కాంగ్రెస్‌ గూండాలకు పోలీసులు ఎస్కార్ట్‌ ఇచ్చి తీసుకెళ్తున్నారని కేటీఆర్‌ ఆరోపించారు. “కేసీఆర్‌ ఇంటిపై దాడి చేయడానికి కాంగ్రెస్‌ గూండాలను తీసుకెళ్లాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా?” అని ప్రశ్నించారు.పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్‌.. “పోలీసులు కాంగ్రెస్‌ కండువా కప్పుకోండి. పోలీసులపై మాకు నమ్మకం లేదు. మా నాయకుడిని మేమే కాపాడుకుంటాం” అని వ్యాఖ్యానించారు.తమ నాయకుడి వద్దకు, తమ ఇంటికి తాము వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్‌ ప్రశ్నించారు. పోలీసుల వ్యవహారశైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.


Featured post

విద్యార్థులను పార్టీతో అనుసంధానం చేయడమే లక్ష్యం

రెండు వారాల ‘స్టూడెంట్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ :అఖిలేశ్‌ యాదవ్‌ లక్నో: విద్యార్థులను సమాజ్‌వాదీ పార్టీతో అనుసంధానం చేసేందుకు రెండు వారాల పాటు ‘స...