Monday, 28 September 2026

ఎన్నికల సంఘం నిర్ణయాలు చెల్లవు




జూన్‌ 24కి ముందున్న ఓటరు జాబితాయే ప్రాతిపదిక కావాలి: కపిల్‌ సిబల్‌

దిల్లీ: ఎన్నికల సంఘం (EC) తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియపై రాజ్యసభ సభ్యుడు కపిల్ సిబల్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. కేవలం ఒక ప్రధాన ఎన్నికల కమిషనర్ మాత్రమే నిర్ణయం తీసుకుంటే, అది కచ్చితంగా ఎన్నికల సంఘం నిర్ణయం కాదని ఆయన స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో గతంలో ఈసీ తీసుకున్న ఎన్నికల సంబంధిత వివాదాస్పద నిర్ణయాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు.

దిల్లీలో మీడియాతో మాట్లాడుతూ కపిల్ సిబల్ తీవ్రంగా స్పందించారు. "జూన్‌ 24 నాటి ఈసీ నోటిఫికేషన్‌కు ముందు ఏ ఓటరు జాబితా అయితే ఉందో, దాన్నే ప్రాతిపదికగా తీసుకోవాలి. దిల్లీలో బీఎల్వోలు (BLO) ఇంటింటికి వెళ్లి ఓట్లు పరిశీలించడం అనేది ప్రస్తుత పరిస్థితుల్లో ఆచరణ సాధ్యం కాని విషయం. ఇకపై మౌనంగా ఉండలేం. సరిపోతుంది.. చాలు!" అని హెచ్చరించారు. ప్రజాస్వామ్య భారతదేశం మనుగడ సాగించాలన్నా, వర్ధిల్లాలన్నా దేశ యువత, పౌరులు, పత్రికలు, విజ్ఞులంతా ఏకమై ఈ చర్యలను తీవ్రంగా వ్యతిరేకించాలని పిలుపునిచ్చారు.

No comments:

Post a Comment

Featured post

ఎన్నికల సంఘం నిర్ణయాలు చెల్లవు

జూన్‌ 24కి ముందున్న ఓటరు జాబితాయే ప్రాతిపదిక కావాలి: కపిల్‌ సిబల్‌ దిల్లీ: ఎన్నికల సంఘం (EC) తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, ఓటర్ల జాబితా ప్...