- ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించాలి: రామచందర్‌రావు
హైదరాబాద్: తెలంగాణలో ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు చెల్లించకపోవడంతో విద్యావ్యవస్థ పూర్తిగా కుప్పకూలిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్‌రావు ఆరోపించారు. 40 లక్షల మంది విద్యార్థులకు సంబంధించి రూ.15 వేల కోట్లకు పైగా ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు ఉన్నాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని బీజేపీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోందని తెలిపారు.
బకాయిలు చెల్లించకపోవడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదని, కళాశాలల యాజమాన్యాలు విద్యార్థుల సర్టిఫికెట్లను కూడా తమ వద్దే ఉంచుకుంటున్నాయని రామచందర్‌రావు అన్నారు.ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిల విషయంలో గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కూడా అదే విధానాన్ని కొనసాగిస్తోందని ఆయన విమర్శించారు. హైకోర్టు ఆదేశాల నేపథ్యంలో ఒక బ్యాచ్ విద్యార్థులకు సంబంధించిన నిధులను విడుదల చేసినప్పటికీ, పాత బకాయిలు మాత్రం ఇంకా పెండింగ్‌లోనే ఉన్నాయని పేర్కొన్నారు.
ఈ సమస్యపై తాను వారం రోజుల్లోనే దాదాపు ఐదుసార్లు పోలీసుల అదుపులోకి తీసుకున్నారని రామచందర్‌రావు తెలిపారు. బకాయిల విడుదల కోసం సోమవారం నిరాహార దీక్ష చేపట్టినా ప్రభుత్వం నుంచి ఎలాంటి స్పందన రాలేదని చెప్పారు.తాజాగా సోమవారం ఉదయం తనతో పాటు వందలాది మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్టు చేశారని ఆయన ఆరోపించారు. విద్యార్థుల ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను ప్రభుత్వం చెల్లించకపోవడం వల్ల తెలంగాణలో విద్యా వ్యవస్థ తీవ్ర సంక్షోభంలోకి వెళ్లిందని రామచందర్‌రావు పేర్కొన్నారు.
No comments:
Post a Comment