ఇబ్రహీంపట్నం: శంషాబాద్ విమానాశ్రయంలో అదుపులోకి తీసుకున్న యూట్యూబర్ నందనను పోలీసులు ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. విదేశాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామంటూ మోసాలకు పాల్పడ్డారనే ఆరోపణలు నందన, ఆమె భర్తపై ఉన్నాయి. పలువురు బాధితులు ఇచ్చిన ఫిర్యాదుల మేరకు గతంలో ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది.
కేసు వెలుగులోకి వచ్చిన తర్వాత నందన దంపతులు అజ్ఞాతంలోకి వెళ్లడంతో ఏపీ పోలీసులు వారి పేర్లపై లుక్‌ఔట్ సర్క్యులర్ (ఎల్‌వోసీ) జారీ చేశారు. ఈ క్రమంలో బ్రిటిష్ ఎయిర్‌వేస్ విమానంలో నందన సోమవారం ఒంటరిగా స్వదేశానికి బయలుదేరారు.
శంషాబాద్ విమానాశ్రయంలో దిగిన ఆమె పాస్‌పోర్టు, వీసా పత్రాలను ఇమిగ్రేషన్ అధికారులు తనిఖీ చేశారు. ఎల్‌వోసీ ఉన్నట్లు గుర్తించిన అధికారులు నందనను అదుపులోకి తీసుకుని ఇబ్రహీంపట్నం పోలీసులకు అప్పగించారు. అనంతరం విచారణ నిమిత్తం ఆమెను పోలీస్‌స్టేషన్‌కు తరలించారు.
ఈ కేసుకు సంబంధించి నందనను పోలీసులు విచారిస్తున్నారు.
No comments:
Post a Comment