Monday, 7 September 2026

రేవంత్‌రెడ్డికి మూడు విషయాలే తెలుసు

 


డిస్ట్రక్షన్‌, డిస్ట్రాక్షన్‌, డైవర్షన్‌ : కేటీఆర్‌

హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 7: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి మూడు విషయాలు తప్ప మరేమీ తెలియదని బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ విమర్శించారు. ‘‘డిస్ట్రక్షన్‌, డిస్ట్రాక్షన్‌, డైవర్షన్‌ .. ఇవే ఆయనకు తెలుసు. మరేదీ తెలియదు’’ అని అన్నారు.

అసెంబ్లీలో బీఆర్‌ఎస్‌ సభ్యులను లోపలికి రాకుండా చేసేందుకు మరోసారి దృష్టి మళ్లింపు నాటకానికి తెరతీశారని కేటీఆర్‌ ఆరోపించారు. ఈ సందర్భంగా పార్లమెంట్‌, అసెంబ్లీలో నిబంధనల అమలుపై ప్రశ్నలు లేవనెత్తారు.

‘‘రాహుల్‌ గాంధీ టీషర్ట్‌ వేసుకుని పార్లమెంట్‌కు వెళ్లొచ్చు. అదానీ, మోదీ చిత్రాలు ఉన్న టీషర్ట్‌ వేసుకుని కూడా ఆయన సభకు వెళ్లొచ్చు. అలాంటప్పుడు పార్లమెంట్‌కు ఒక నిబంధన, శాసనసభకు మరో నిబంధన ఉంటుందా?’’ అని కేటీఆర్‌ ప్రశ్నించారు.

పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో లోక్‌సభకు వర్తించే నిబంధనలే శాసనసభకూ వర్తించాల్సి ఉంటుందని ఆయన అన్నారు. ‘‘ప్రతిపక్షంలో ఉన్న కాంగ్రెస్‌ నేతలు రాహుల్‌ గాంధీ, ప్రియాంక గాంధీ నినాదాలతో కూడిన టీషర్టులు ధరించి పార్లమెంట్‌కు వెళ్తున్నారు. మరి మాకు మాత్రం వేరే నిబంధనలు ఎందుకు?’’ అని నిలదీశారు.

తమను సభలోకి రాకుండా అడ్డుకోవడంపై పోలీసులను ప్రశ్నించినా సరైన సమాధానం ఇవ్వడం లేదని కేటీఆర్‌ తెలిపారు. స్పీకర్‌, చీఫ్‌ మార్షల్‌ ఆదేశాల మేరకే తమను అడ్డుకుంటున్నామని పోలీసులు చెబుతున్నారని ఆయన పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

విద్యార్థులను పార్టీతో అనుసంధానం చేయడమే లక్ష్యం

రెండు వారాల ‘స్టూడెంట్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ :అఖిలేశ్‌ యాదవ్‌ లక్నో: విద్యార్థులను సమాజ్‌వాదీ పార్టీతో అనుసంధానం చేసేందుకు రెండు వారాల పాటు ‘స...