హైదరాబాద్: తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. గూండాలతో కలిసి మాజీ సీఎం, బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్‌ను హత్య చేసేందుకు ప్రయత్నిస్తున్నారని రేవంత్‌రెడ్డిపై తీవ్ర ఆరోపణలు చేశారు.కాంగ్రెస్ గూండాలకు పోలీసులు ఎస్కార్ట్ ఇచ్చి తీసుకెళ్తున్నారని కేటీఆర్ ఆరోపించారు. “కేసీఆర్ ఇంటిపై దాడి చేయడానికి కాంగ్రెస్ గూండాలను తీసుకెళ్లాలని పోలీసులకు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చిందా?” అని ప్రశ్నించారు.పోలీసుల తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన కేటీఆర్.. “పోలీసులు కాంగ్రెస్ కండువా కప్పుకోండి. పోలీసులపై మాకు నమ్మకం లేదు. మా నాయకుడిని మేమే కాపాడుకుంటాం” అని వ్యాఖ్యానించారు.తమ నాయకుడి వద్దకు, తమ ఇంటికి తాము వెళ్తుంటే పోలీసులు ఎందుకు అడ్డుకుంటున్నారని కేటీఆర్ ప్రశ్నించారు. పోలీసుల వ్యవహారశైలిని ఆయన తీవ్రంగా తప్పుబట్టారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
విద్యార్థులను పార్టీతో అనుసంధానం చేయడమే లక్ష్యం
రెండు వారాల ‘స్టూడెంట్ అవేర్‌నెస్ వీక్’ :అఖిలేశ్ యాదవ్ లక్నో: విద్యార్థులను సమాజ్‌వాదీ పార్టీతో అనుసంధానం చేసేందుకు రెండు వారాల పాటు ‘స...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment