Tuesday, 8 September 2026

విద్యార్థులను పార్టీతో అనుసంధానం చేయడమే లక్ష్యం

రెండు వారాల ‘స్టూడెంట్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ :అఖిలేశ్‌ యాదవ్‌



లక్నో: విద్యార్థులను సమాజ్‌వాదీ పార్టీతో అనుసంధానం చేసేందుకు రెండు వారాల పాటు ‘స్టూడెంట్‌ అవేర్‌నెస్‌ వీక్‌’ నిర్వహించాలని నిర్ణయించినట్లు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు.ఈ కార్యక్రమంలో పార్టీ కార్యకర్తలు కళాశాలలు, విశ్వవిద్యాలయాలు, హాస్టళ్లు, ఇతర విద్యా సంస్థలను సందర్శించి విద్యార్థులతో మమేకమవుతారని చెప్పారు. ప్రతి ఏడాది మాదిరిగానే ఈసారి కూడా విద్యార్థులను పార్టీకి చేరువ చేయడమే లక్ష్యంగా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు.విద్యార్థులను కేవలం పార్టీ సభ్యులుగా చేర్చుకోవడం మాత్రమే కాకుండా.. సమాజ్‌వాదీ పార్టీ సిద్ధాంతాలను వారికి వివరించి, పార్టీతో అనుబంధం పెంచేలా ప్రోత్సహించనున్నట్లు అఖిలేశ్‌ పేర్కొన్నారు.“కొత్త తరానికి కొత్త ఆలోచనా విధానం ఉంటుంది. అందుకే కొత్త యూనిఫాం కూడా ఉండాలి. ఆ దిశగా విద్యార్థులకు ఈ కొత్త యూనిఫాంను అందిస్తున్నాం” అని అఖిలేశ్‌ యాదవ్‌ తెలిపారు.విద్యార్థుల్లో పార్టీ సందేశాన్ని విస్తృతంగా తీసుకెళ్లేందుకు ఈ కొత్త యూనిఫాం ఉపయోగపడుతుందని ఆయన అన్నారు.

No comments:

Post a Comment

Featured post

ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సురక్షితమేనా?

మణిపూర్‌ సంగీతకారుడి హత్యపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం న్యూఢిల్లీ: మణిపూర్‌కు చెందిన ప్రముఖ సంగీతకారుడు చోంగ్తమ్‌ విక్రమ్‌ సింగ్‌ హత్యపై కాంగ్రెస్...