Tuesday, 8 September 2026

మా కుటుంబానికి భయం లేదు.. రెండింతలు తిరిగి కొట్లాడతాం: పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి




హైదరాబాద్‌: అసెంబ్లీ వద్ద తన తల్లితో పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారని పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అలా వ్యవహరించారని ఆరోపిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. “అలా చేస్తే మేము భయపడతామని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారు. నేను ఇంద్రారెడ్డి కొడుకును.. ఆమె ఇంద్రారెడ్డి భార్య. మా వ్యవస్థలో భయం పెట్టడం తప్ప.. భయపడటం ఉండదు” అని కార్తీక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి తమ కుటుంబ చరిత్రను మర్చిపోయినట్లున్నారని అన్నారు. తన తండ్రి ఇంద్రారెడ్డి నక్సలైట్ల ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. పోలీసులు ఎన్‌కౌంటర్‌కు తీసుకెళ్లే పరిస్థితులు వచ్చినా భయపడలేదని, ఇప్పుడు పోలీసుల చర్యలకు భయపడతామా? అని ప్రశ్నించారు. ఇంద్రారెడ్డి హోంమంత్రి పదవి కోల్పోయినప్పుడు, అనంతరం చంద్రబాబు అక్రమంగా జైలులో పెట్టిన సమయంలోనూ తమ కుటుంబం భయపడలేదని కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి మృతి చెందిన సమయంలో తన వెంట ఎవరూ లేకపోయినా తన తల్లి ఒంటరిగా రాజకీయాల్లోకి వచ్చారని, అప్పుడే భయపడలేదని అన్నారు. “నేను కానీ, నా కార్యకర్తలు కానీ, ఇంద్రారెడ్డి అభిమానులు కానీ ఒక్క చుక్క కూడా భయపడం. రెండింతలు తిరిగి కొట్లాడతాం” అని కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు.


No comments:

Post a Comment

Featured post

ఢిల్లీలో ఈశాన్య రాష్ట్రాల ప్రజలు సురక్షితమేనా?

మణిపూర్‌ సంగీతకారుడి హత్యపై రాహుల్‌ గాంధీ ఆగ్రహం న్యూఢిల్లీ: మణిపూర్‌కు చెందిన ప్రముఖ సంగీతకారుడు చోంగ్తమ్‌ విక్రమ్‌ సింగ్‌ హత్యపై కాంగ్రెస్...