కవితకు వేముల ప్రశాంత్‌రెడ్డి కౌంటర్
హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ కవితపై మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్‌రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. సొంత తండ్రి కేసీఆర్, సొంత అన్న కేటీఆర్‌ను విమర్శించిన కవిత.. తనను విమర్శించడం ఆశ్చర్యం కలిగించలేదని అన్నారు. “నీ వల్ల నీ తండ్రి కేసీఆర్ గారు ఎంత మనోవేదనకు గురవుతున్నారో ఒక్కసారి ఆలోచించావా కవిత?” అని ప్రశాంత్‌రెడ్డి ప్రశ్నించారు. సొంత తండ్రి, సొంత అన్ననే విమర్శించినప్పుడు తనపై కవిత విమర్శలు చేయడం పెద్దగా ఆశ్చర్యం కలిగించలేదని పేర్కొన్నారు. కవిత రెండోసారి ఏకపక్షంగా ఎమ్మెల్సీగా ఎన్నిక కావడంలో తన పాత్ర ఏమిటో కేసీఆర్‌కు తెలుసని ప్రశాంత్‌రెడ్డి అన్నారు. ఈ విషయంలో వాస్తవాలు కేసీఆర్‌కు పూర్తిగా తెలుసని స్పష్టం చేశారు. కవిత వ్యాఖ్యలకు స్పందిస్తూ ప్రశాంత్‌రెడ్డి చేసిన ఈ వ్యాఖ్యలు బీఆర్‌ఎస్‌లో కొనసాగుతున్న అంతర్గత విభేదాల నేపథ్యంలో ప్రాధాన్యం సంతరించుకున్నాయి.
No comments:
Post a Comment