- కాంగ్రెస్ నేత సందీప్ దీక్షిత్ నిలదీత
న్యూఢిల్లీ: తొలి త్రైమాసికంలో దేశ జీడీపీ (GDP) వృద్ధి రేటు 7.8 శాతంగా నమోదవడంపై కాంగ్రెస్ నాయకుడు సందీప్ దీక్షిత్ తీవ్రస్థాయిలో స్పందించారు. జీడీపీ వృద్ధి రేటుకు, దేశంలో దారుణంగా కుప్పకూలుతున్న విద్యావ్యవస్థకు ఉన్న సంబంధమేంటని ఆయన కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... "కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ నిర్వహిస్తున్న 'ఛాత్రోం కీ గూంజ్' కార్యక్రమానికి యువత ఉత్సాహంగా తరలివస్తున్నారు. ఎవరూ వారిని బలవంతంగా లాక్కొని రావడం లేదు, రాహుల్ గాంధీ ఏం చెబుతున్నారో, దేశంలో జరుగుతున్న పరిస్థితులు ఏంటో అర్థం చేసుకునే విద్యార్థులు స్వచ్ఛందంగా వస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వం సానుకూల ధోరణితో ఆలోచిస్తే... 'ఛాత్రోం కీ గూంజ్' నుంచి ఎన్నో విషయాలను నేర్చుకుని, మీ పాలనను మెరుగుపరుచుకునే అవకాశం ఉంటుంది" అని కేంద్రానికి హితవు పలికారు.

No comments:
Post a Comment