- 53 శాతం మంది మద్దతు: చాణక్య స్ట్రాటజీస్
హైదరాబాద్: తెలంగాణలో గత పదేళ్ల బీఆర్ఎస్ పాలనపై ప్రజల్లో ఇప్పటికీ సానుకూల అభిప్రాయం ఉందని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది. సంస్థ నిర్వహించిన అధ్యయనం ప్రకారం.. 53 శాతం మంది ప్రజలు గత బీఆర్ఎస్ పాలన బాగుందని అభిప్రాయపడగా, ప్రస్తుత కాంగ్రెస్ పాలన బాగుందని 36 శాతం మంది మాత్రమే పేర్కొన్నారు.యువతలోనూ బీఆర్ఎస్కు అనుకూలత ఉన్నట్లు సర్వే పేర్కొంది. దాదాపు 50 శాతం మంది యువత తిరిగి బీఆర్ఎస్ పాలన రావాలని కోరుకుంటున్నారని తెలిపింది.
కేసీఆర్పై వ్యతిరేకత వల్లే ఓటమి కాదు..
2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి ప్రధాన కారణం అప్పటి ముఖ్యమంత్రి, పార్టీ అధినేత కేసీఆర్పై ప్రజల్లో ఉన్న వ్యతిరేకత కాదని చాణక్య స్ట్రాటజీస్ విశ్లేషించింది. కొన్ని నియోజకవర్గాల్లో ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదుర్కొంటున్న ఎమ్మెల్యేలను మార్చకపోవడమే బీఆర్ఎస్కు నష్టం కలిగించిందని పేర్కొంది.
అయితే, వ్యతిరేకత ఎదుర్కొన్న ఆ కొందరు మాజీ ఎమ్మెల్యేలే ఇప్పటికీ ఆయా నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జ్లుగా కొనసాగుతున్నారని తెలిపింది.
కాంగ్రెస్ ఎమ్మెల్యేలపై అసంతృప్తి.. బీఆర్ఎస్ అభ్యర్థులపైనా వ్యతిరేకత
ప్రస్తుతం కొన్ని నియోజకవర్గాల్లో కాంగ్రెస్ ఎమ్మెల్యేల పనితీరుపై ప్రజల్లో అసంతృప్తి ఉన్నప్పటికీ, అదే సమయంలో గతంలో వ్యతిరేకత ఎదుర్కొన్న బీఆర్ఎస్ నేతలపై కూడా ప్రజలకు సానుకూలత లేకపోవడంతో కొంతమంది ఓటర్లు తటస్థంగా ఉన్నారని చాణక్య స్ట్రాటజీస్ వెల్లడించింది.
బీఆర్ఎస్ నాయకత్వం ప్రజల్లో వ్యతిరేకత ఉన్న అభ్యర్థులను మార్చి కొత్త ముఖాలకు అవకాశం కల్పిస్తే.. ప్రస్తుతం తటస్థంగా ఉన్న యువత, ముఖ్యంగా జెన్జీ ఓటర్లు బీఆర్ఎస్కు మద్దతుగా మారే అవకాశం ఉందని సంస్థ విశ్లేషించింది.
వచ్చే ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని బీఆర్ఎస్ అభ్యర్థుల ఎంపికలో ప్రజాభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోవడం కీలకమని చాణక్య స్ట్రాటజీస్ అభిప్రాయపడిం
No comments:
Post a Comment