- భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంపై కీలక చర్చ
- ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్య రంగాల్లో సహకారంపై దృష్టి
- భారత్ విజయవంతంగా నిర్వహించిన బ్రిక్స్ అధ్యక్షతపై అభినందనలు
న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్ర మోదీకి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అధ్యక్షుడు షేక్ మహ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్ ఫోన్ చేశారు. మోదీ జన్మదినం సందర్భంగా ఆయనకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భారత్-యూఏఈ సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన కొత్త చర్యలపై ఇరువురు నేతలు చర్చించారు. ఇంధనం, రక్షణ, సాంకేతికత, పెట్టుబడులు, ఆరోగ్య రంగాల్లో పరస్పర సహకారాన్ని మరింత విస్తరించడంపై చర్చ జరిగినట్లు కేంద్రం వెల్లడించింది. భారత్ విజయవంతంగా నిర్వహించిన బ్రిక్స్ అధ్యక్షతపై యూఏఈ అధ్యక్షుడు మోదీకి అభినందనలు తెలిపారు. బ్రిక్స్ సదస్సులో యూఏఈ తరఫున క్రౌన్ ప్రిన్స్ షేక్ ఖాలెద్ పాల్గొన్నందుకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. భారత్ అధ్యక్షతన బ్రిక్స్ సదస్సులో సార్థక ఫలితాలు సాధించేందుకు యూఏఈ అందించిన సహకారం, భాగస్వామ్యాన్ని ఆయన ప్రశంసించారు. పశ్చిమాసియాలో తాజా పరిణామాలపైనా ఇరువురు నేతలు అభిప్రాయాలను పంచుకున్నారు. ప్రాంతీయ శాంతి, భద్రత, సుస్థిరత కోసం నిరంతరం సహకారం, సమన్వయంతో పనిచేయాలన్న తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు.
No comments:
Post a Comment