Wednesday, 30 September 2026

ఆసియా క్రీడల్లో భారత మహిళల ఆర్చరీ జట్టుకు స్వర్ణం

 



  • క్రీడాకారిణులకు అమిత్‌ షా, మన్‌సుఖ్‌ మాండవీయ అభినందనలు

ఆసియా క్రీడలు–2026లో స్వర్ణ పతకం సాధించిన భారత మహిళల ఆర్చరీ జట్టును కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా అభినందించారు.

సామాజిక మాధ్యమంలో స్పందించిన ఆయన.. తీవ్ర ఒత్తిడి పరిస్థితుల్లోనూ విజయమే లక్ష్యంగా భారత జట్టు ప్రదర్శించిన అద్భుతమైన ఏకాగ్రతను ప్రపంచం చూసిందని పేర్కొన్నారు. ఈ విజయాన్ని అభినందిస్తూ.. కొనసాగుతున్న ఆసియా క్రీడల్లో భారత జట్టు మరిన్ని విజయాలు సాధించాలని ఆకాంక్షించారు.

యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్‌ మన్‌సుఖ్‌ మాండవీయ కూడా సాహిల్‌ రాజేశ్‌ జాదవ్‌, చికితా తానిపర్తిలకు అభినందనలు తెలిపారు. ఆసియా క్రీడలు–2026లో కాంపౌండ్‌ మిక్స్‌డ్‌ టీమ్‌ ఈవెంట్‌లో స్వర్ణ పతకం సాధించినందుకు వారిని ప్రశంసించారు.

ఈ విజయం ఎంతో కీలకమైనదని, దీనివల్ల ఎల్‌ఏ–2028 ఒలింపిక్స్‌కు భారత్‌కు కోటా కూడా లభించిందని మాండవీయ పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానాన్ని గొడ్డలితో ధ్వంసం చేసిన దుండగుడు.. ఐర్లాండ్‌లో సంచలనం!

ఐర్లాండ్‌లోని షానన్‌ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉన్న అమెరికా సైనిక రవాణా విమానంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గొడ్డలి, ప్రత్యేక రసాయనాన్ని...