Wednesday, 30 September 2026

ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించాలి



  • వారు ఎంతటి స్థాయిలో ఉన్నా.. ప్రజాస్వామ్యం కంటే ఎవరూ పెద్దవారు కాదు: రాహుల్‌గాంధీ


న్యూఢిల్లీ: ఇండియా కూటమి సమావేశం అనంతరం కాంగ్రెస్‌ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్‌గాంధీ కీలక వ్యాఖ్యలు చేశారు. భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించేలా చర్యలు తీసుకోవాలన్నది ఇండియా కూటమి నేతలందరి వ్యక్తిగత నిబద్ధత అని ఆయన అన్నారు. వారు ఎంతటి ఉన్నత పదవుల్లో ఉన్నా, ఎంతటి సీనియర్‌ నేతలైనా ప్రజాస్వామ్యం కంటే ఎవరూ గొప్పవారు కాదని స్పష్టం చేశారు.


‘‘భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేసిన వారిని శిక్షించేలా చూస్తామని ఇండియా కూటమి నేతలందరూ వ్యక్తిగతంగా కట్టుబడి ఉన్నారు. వారు ఎంతటి సీనియర్లైనా, ఎవరైనా సరే.. దానితో మాకు సంబంధం లేదు. ఈ దేశంలోని ప్రతి ఒక్కరి కంటే భారత ప్రజాస్వామ్యం గొప్పది’’ అని రాహుల్‌గాంధీ పేర్కొన్నారు.


ఇండియా కూటమి సమావేశంలో దేశంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు సంబంధించి ప్రతిపక్షాలు చేస్తున్న పోరాటంపై కూడా చర్చ జరిగిందని ఆయన తెలిపారు. ఎన్నికలు ‘దొంగిలించబడుతున్నాయనే’ అంశాన్ని ప్రజల దృష్టికి తీసుకెళ్లడంలో ప్రతిపక్షాలు గణనీయంగా విజయవంతమయ్యాయని సమావేశంలో అభిప్రాయం వ్యక్తమైనట్లు చెప్పారు.


ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా భారత ప్రజాస్వామ్యాన్ని ధ్వంసం చేశారనే ఆరోపణలను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లగలిగామని రాహుల్‌గాంధీ అన్నారు. ముఖ్యంగా యువతలో కొత్త తరహా ప్రతిఘటన భావన పెరుగుతోందని పేర్కొన్నారు. దేశంలో ప్రస్తుతం జరుగుతున్న పరిణామాలు తప్పు అని, వాటిని అడ్డుకోవాల్సిన అవసరం ఉందనే అభిప్రాయం యువతలో బలపడుతోందని ఆయన తెలిపారు.



No comments:

Post a Comment

Featured post

రూ.560 కోట్ల అమెరికా సైనిక విమానాన్ని గొడ్డలితో ధ్వంసం చేసిన దుండగుడు.. ఐర్లాండ్‌లో సంచలనం!

ఐర్లాండ్‌లోని షానన్‌ విమానాశ్రయంలో పార్క్‌ చేసి ఉన్న అమెరికా సైనిక రవాణా విమానంపై ఓ వ్యక్తి దాడికి పాల్పడ్డాడు. గొడ్డలి, ప్రత్యేక రసాయనాన్ని...