Friday, 11 September 2026

వాణిజ్య అడ్డంకులు తొలగించండి





  • 100 బ్రిక్స్‌ స్టార్టప్‌లను ప్రోత్సహించండి: మోదీ
  • బ్రిక్స్‌ బిజినెస్‌ కౌన్సిల్‌కు ప్రధాని కీలక సూచనలు
  • ఏటా 10 వాణిజ్య అడ్డంకులపై నివేదిక.. 
  • 100 స్టార్టప్‌ల విస్తరణకు మద్దతు 
  • వ్యాపార సంస్థల మధ్య 1,000 కొత్త భాగస్వామ్యాలు ఏర్పాటు చేయాలి

దిల్లీ: బ్రిక్స్‌ కూటమి మూడో దశాబ్దంలోకి అడుగుపెట్టిన నేపథ్యంలో ఆర్థిక సహకారాన్ని మరింత బలోపేతం చేయాలని ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దిల్లీలో జరుగుతున్న బ్రిక్స్‌ బిజినెస్‌ ఫోరం నేతల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బ్రిక్స్‌ దేశాల మధ్య వాణిజ్యానికి ఉన్న ప్రధాన అడ్డంకులను తొలగించేందుకు చర్యలు చేపట్టాలని బ్రిక్స్‌ బిజినెస్‌ కౌన్సిల్‌ను కోరారు.

బ్రిక్స్‌ దేశాల మధ్య ఉన్న టాప్‌ 10 వాణిజ్య అడ్డంకులపై నివేదిక రూపొందించి, వాటిని తొలగించే మార్గాలను సూచించాలని మోదీ అన్నారు. అలాగే ప్రతి ఏడాది 100 బ్రిక్స్‌ స్టార్టప్‌లను ఇతర బ్రిక్స్‌ మార్కెట్లలో విస్తరించేందుకు సహకరించాలని సూచించారు.

ఇరుదేశాల వ్యాపార సంస్థల మధ్య కొత్త భాగస్వామ్యాలను ప్రోత్సహిస్తూ 1,000 కొత్త బిజినెస్‌ భాగస్వామ్యాలు ఏర్పాటు చేయాలని ప్రధాని పిలుపునిచ్చారు. ఈ మూడు అంశాల్లో సాధించిన పురోగతిని ప్రతి ఏడాది సమీక్షించాలని సూచించారు.

‘‘బ్రిక్స్‌ లక్ష్యాలను కార్యాచరణగా మార్చాలి. మన సమష్టి బలాన్ని ప్రపంచ సమస్యలకు పరిష్కారాలుగా మలచాలి. బ్రిక్స్‌ ముందుకు సాగడంతో పాటు ప్రపంచాన్ని కూడా ముందుకు నడిపించాలి’’ అని మోదీ అన్నారు.

No comments:

Post a Comment

Featured post

ఆస్తులన్నీ అమ్మి.. అన్నదానం చేసిన దంపతులు

  హనుమకొండకు చెందిన లింగాల కేదారి–పుష్పలత.. సేవా తపనకు నిలువెత్తు నిదర్శనం హనుమకొండ: ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే జీవిత ధ్యేయంగా భావించ...