హైదరాబాద్: శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. శాసనమండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్‌రెడ్డి ఇద్దరినీ ప్రస్తుత సమావేశాలు పూర్తయ్యే వరకు సస్పెండ్ చేశారు.
ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేయాలని మంత్రి శ్రీధర్‌బాబు శాసనమండలిలో తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించిన ఛైర్మన్.. తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిని సెషన్ మొత్తానికి సస్పెండ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అనంతరం శాసనమండలి వాయిదా పడింది.
అంతకుముందు శాసనసభ కూడా తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై చర్యలు తీసుకోవాలని తీర్మానించింది. మంత్రి దామోదర రాజనర్సింహ ఈ తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు.
స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్‌పై ఇద్దరు ఎమ్మెల్సీలు చేసిన దూషణలను శాసనసభ తీవ్రంగా ఖండించింది. సభా మర్యాదలకు విరుద్ధంగా చేసిన వ్యాఖ్యలపై నిరసన వ్యక్తం చేసింది. మహిళల ఎదుట అనుచితంగా ప్రవర్తించిన తీరును కూడా సభ తప్పుబట్టింది.
బీఆర్‌ఎస్ సభ్యుల అనుచిత ప్రవర్తనకు ఆ పార్టీ అధినేత కేసీఆర్ బాధ్యత వహించాలని శాసనసభ తీర్మానించింది. శాసనసభాపతి గడ్డం ప్రసాద్‌కుమార్‌కు కేసీఆర్ బేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసింది. నిబంధనలకు అనుగుణంగా తాతా మధు, నవీన్‌కుమార్‌రెడ్డిపై శాసనమండలి ఛైర్మన్ చర్యలు తీసుకోవాలని తీర్మానంలో పేర్కొంది.
No comments:
Post a Comment