Showing posts with label #Chhattisgarh #Encounter #NaxalsKilled #SecurityForces #Bastar #Bijapur #Sukma #AntiNaxalOperation #BreakingNews #DRG #Maoists. Show all posts
Showing posts with label #Chhattisgarh #Encounter #NaxalsKilled #SecurityForces #Bastar #Bijapur #Sukma #AntiNaxalOperation #BreakingNews #DRG #Maoists. Show all posts

Friday, 2 January 2026

ఛత్తీస్‌గఢ్‌లో భారీ ఎన్‌కౌంటర్ .. 14 మంది మావోయిస్టుల హతం






బీజాపూర్: ఛత్తీస్‌గఢ్‌లోని లో భారీ ఎన్‌కౌంటర్ జరిగింది . శనివారం మావోయిస్టులకు, భద్రతా బలగాలకు మధ్య ఎదురుకాల్పులు చోటుచేసుకున్నాయి. కనీసం 14 మంది నక్సలైట్లు మరణించారు. బస్తర్ రేంజ్ పరిధిలోని బీజాపూర్. సుక్మా జిల్లాల్లో ఈ ఆపరేషన్లు జరిగాయి.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. దక్షిణ బస్తర్ ప్రాంతంలో సాయుధ మావోయిస్టులు తిరుగుతున్నారనే పక్కా సమాచారంతో డిస్ట్రిక్ట్ రిజర్వ్ గార్డ్ (డీఆర్‌జీ) బలగాలు కూంబింగ్‌ ఆపరేషన్ చేపట్టాయి. ఈ క్రమంలో శనివారం తెల్లవారుజామున 5 గంటల నుంచి బీజాపూర్‌లో, ఉదయం 8 గంటల నుంచి సుక్మాలో ఎదురుకాల్పులు ప్రారంభమయ్యాయి. ఈ కాల్పుల అనంతరం ఘటనా స్థలాల నుంచి మొత్తం 14 మంది మావోయిస్టుల మృతదేహాలను భద్రతా దళాలు స్వాధీనం చేసుకున్నాయి. మృతులలో ఇద్దరు బీజాపూర్ జిల్లాకు చెందిన వారు కాగా, 12 మంది సుక్మా జిల్లాకు చెందిన వారు. మృతుల్లో కొంటా ఏరియా కమిటీ కార్యదర్శి మంగడు ఉన్నారు. ఘటనా స్థలం నుంచి భారీగా ఆయుధ సామాగ్రిని స్వాధీనం చేసుకున్నారు. ఇందులో ఏకే-47 , ఇన్సాస్ , ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు ఉన్నాయి. బస్తర్ రేంజ్ ఐజీ పి. సుందర్రాజ్ ఈ ఆపరేషన్ వివరాలను వెల్లడించారు. ఈ ప్రాంతంలో ఇంకా గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.

Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...