Monday, 5 October 2026

భారత కీర్తిని పెంచే ప్రతి సందర్భాన్ని స్వాగతించాలి

 


  •  పైలట్ స్మిత్ మచ్ఛర్ సాహసాన్ని ప్రశంసించిన బీజేపీ నేత కౌసర్ జహాన్

న్యూఢిల్లీ:భారతదేశంకీర్తి ప్రతిష్టలు ఇనుమడించే ప్రతి సంఘటనను తాము స్వాగతించి, అభినందిస్తామని బీజేపీ నేత కౌసర్ జహాన్ పేర్కొన్నారు. ఫ్లైదుబాయ్ (flydubai) విమానంపై హైజాక్ యత్నం జరిగినప్పుడు అత్యంత సాహసంతో అనేక ప్రాణాలను కాపాడిన భారతీయ పైలట్ కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌ను ప్రధాని నరేంద్ర మోడీ అభినందించారని, ప్రపంచవ్యాప్తంగా ఆయన ధైర్యసాహసాలు ప్రశంసించబడుతున్నాయని ఆమె అన్నారు.అయితే, ఈ విషయమై కాంగ్రెస్ పార్టీకి ఎందుకు సమస్య వస్తోందో తనకి అర్థం కావడం లేదని కౌసర్ జహాన్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ దేశ వ్యతిరేక శక్తుల వైపే నిలబడటానికి ప్రాధాన్యం ఇస్తుందని ఆమె తీవ్రస్థాయిలో ఆరోపించారు.

No comments:

Post a Comment

Featured post

అయోధ్య నుంచి పోటీ చేయండి

యోగి ఆదిత్యనాథ్‌కు అఖిలేశ్‌ యాదవ్‌ సవాల్‌ త్వరలో రామ మందిరానికి ఎస్పీ నేతలతో కలిసి వెళ్తా: ఎస్పీ అధినేత  న్యూఢిల్లీ, అక్టోబర్‌ 8: ఉత్తరప్రదే...