Showing posts with label # Kavitha # Telangana #Congress government # TRS. Show all posts
Showing posts with label # Kavitha # Telangana #Congress government # TRS. Show all posts

Thursday, 2 July 2026

ఉప్పల్‌ భగాయత్‌లో తీవ్ర ఉద్రిక్తత..కవిత అరెస్ట్



హైదరాబాద్:ఉప్పల్ భగాయత్ పరిధిలో తెలంగాణ ఉద్యమకారులకు వెంటనే ఇళ్ల స్థలాలు కేటాయించాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ రక్షణసేన పార్టీ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత చేపట్టిన భూపోరాటం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. బోడుప్పల్ ప్రాంతంలో ఉద్యమకారులతో కలిసి ఆమె గురువారం ఉదయం నిరసన కార్యక్రమానికి దిగారు. అయితే, ఈ ఆందోళన కార్యక్రమానికి ఎలాంటి ముందస్తు అనుమతి లేదంటూ రంగంలోకి దిగిన పోలీసులు, అక్కడ నిర్మించిన టెంట్లను బలవంతంగా తొలగించారు. ఈ క్రమంలో పోలీసులు, నిరసనకారుల మధ్య పెద్ద ఎత్తున తోపులాట జరగడంతో కల్వకుంట్ల కవితకు స్వల్ప గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు కవితతో పాటు పలువురు ఉద్యమకారులను అదుపులోకి తీసుకుని, అరెస్ట్ చేసి బొల్లారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు. కవిత అరెస్ట్ సమాచారం తెలియడంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆమె మద్దతుదారులు, పార్టీ కార్యకర్తలు బొల్లారం పీఎస్ ఎదుట భారీ సంఖ్యలో మోహరించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద పెట్టున నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.

Featured post

ప్రజాస్వామ్యానికి ఓటర్ల జాబితానే ప్రాణం

  పరిశుభ్రమైన, నవీకరించిన ఓటర్ల జాబితా అవసరమన్న శివరాజ్‌ సింగ్‌ చౌహాన్‌ పరిశుభ్రమైన, ఎప్పటికప్పుడు నవీకరించబడిన ఓటర్ల జాబితా ప్రజాస్వామ్యాని...