ఇది భారత్ సార్వభౌమత్వం, ప్రాదేశిక సమగ్రతకు సంబంధించిన అంశమన్న విదేశాంగ శాఖ
జమ్మూకశ్మీర్‌పై ఐక్యరాజ్యసమితి సాధారణ సభ (యూఎన్‌జీఏ)లో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ చేసిన వ్యాఖ్యలను భారత్ తిరస్కరించింది.
న్యూఢిల్లీలో విలేకరులకు వివరాలు వెల్లడించిన విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్.. జమ్మూకశ్మీర్ అంశం భారత్ ప్రాదేశిక సమగ్రత, సార్వభౌమత్వానికి సంబంధించినదని చెప్పారు. ఈ విషయంలో బయటి దేశాలకు ఎలాంటి హక్కు లేదా జోక్యం చేసుకునే స్థానం లేదని స్పష్టం చేశారు.
ఐబీఎస్‌ఏ ప్రకటనపై..
ఐబీఎస్‌ఏ ప్రకటనపై జైస్వాల్ మాట్లాడుతూ.. న్యూయార్క్‌లో జరిగిన ఐక్యరాజ్యసమితి సాధారణ సభ సమావేశాల సందర్భంగా భారత్, బ్రెజిల్, దక్షిణాఫ్రికా దేశాల విదేశాంగ మంత్రుల స్థాయి సమావేశం జరిగిందని తెలిపారు.
ఆ సమావేశం అనంతరం మూడు దేశాలు సంయుక్త ప్రకటన విడుదల చేశాయని, అందులో ఆయా దేశాల ఉమ్మడి అభిప్రాయాలను పొందుపరిచారని చెప్పారు. ఆ ప్రకటనలో ఆర్థిక, అభివృద్ధి, కొన్ని రాజకీయ అంశాలకు సంబంధించిన విషయాలు ఉన్నాయని వివరించారు.
పాలస్తీనా అంశంపై భారత్ తన వైఖరిగా రెండు దేశాల పరిష్కారానికి (టూ-స్టేట్ సొల్యూషన్) మద్దతు ఇస్తోందని జైస్వాల్ స్పష్టం చేశారు.

No comments:
Post a Comment