- అధ్యక్షుడు, కార్యదర్శి, సంయుక్త కార్యదర్శి పదవులు ఏబీవీపీ అభ్యర్థులకే
- ఉపాధ్యక్ష పదవిని గెలుచుకున్న స్వతంత్ర అభ్యర్థి దీపాన్షు షోకీన్
- విజయం సాధించిన ఏబీవీపీ అభ్యర్థులకు రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు
న్యూఢిల్లీ, సెప్టెంబర్ 19: ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్ (DUSU) ఎన్నికల్లో అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ABVP) మూడు కీలక పదవులను కైవసం చేసుకుంది. ఏబీవీపీకి చెందిన యశ్ దబాస్ అధ్యక్షుడిగా, రియా ఛావ్డీ కార్యదర్శిగా, లక్ష్య రాజ్ సింగ్ సంయుక్త కార్యదర్శిగా విజయం సాధించారు. ఉపాధ్యక్ష పదవిలో మాత్రం స్వతంత్ర అభ్యర్థి దీపాన్షు షోకీన్ గెలుపొందారు.
ఎన్నికల్లో విజయం సాధించిన ఏబీవీపీ అభ్యర్థులకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అభినందనలు తెలిపారు. ఈ విజయం యువతలో ‘నేషన్ ఫస్ట్’ విధానంపై ఉన్న విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తోందని ఆయన సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. విద్యార్థుల సంక్షేమం కోసం ఏబీవీపీ మరింత అంకితభావంతో పనిచేస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు.
No comments:
Post a Comment