Monday, 14 September 2026

‘గోవా ఫస్ట్’ కూటమిని గెలిపిస్తారు

 



బీజేపీ, కాంగ్రెస్‌లతో విసిగిపోయిన గోవా ప్రజలు : కేజ్రీవాల్

పొండా, గోవా: గణపతి ఉత్సవాల సందర్భంగా ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్.. గోవా ఫార్వర్డ్ పార్టీ (జీఎఫ్‌పీ) అధ్యక్షుడు విజయ్ సర్దేశాయ్ పూర్వీకుల ఇంటిని సందర్శించారు. ఈ సందర్భంగా సర్దేశాయ్ కుటుంబ సభ్యులను కలుసుకుని గణపతి బప్పా ఆశీర్వాదాలు తీసుకున్నారు.

అనంతరం కేజ్రీవాల్ మాట్లాడుతూ.. గణపతి బప్పా ఉత్సవాల సందర్భంగా విజయ్ సర్దేశాయ్ ఇంటికి వచ్చి ఆయన కుటుంబ సభ్యులందరినీ కలిసినట్లు తెలిపారు. దూర ప్రాంతాల నుంచి సర్దేశాయ్ బంధువులు, కుటుంబ సభ్యులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకున్నారని, వారందరినీ కలవడం ఎంతో సంతోషంగా అనిపించిందని చెప్పారు.

గణపతి బప్పా ఆశీర్వాదాలు కూడా తీసుకున్నామని కేజ్రీవాల్ తెలిపారు. శుభకార్యాన్ని ప్రారంభించే ముందు వినాయకుడి ఆశీర్వాదాలు తీసుకోవడం సంప్రదాయమని పేర్కొన్నారు. గణేశ్ చతుర్థి సందర్భంగా వినాయకుడి ఆశీర్వాదాలు తీసుకున్న అనంతరం ‘గోవా ఫస్ట్’ కూటమిని ప్రారంభించినట్లు వెల్లడించారు.

బీజేపీ, కాంగ్రెస్ పార్టీలతో విసిగిపోయిన గోవా ప్రజలు ఈ ‘గోవా ఫస్ట్’ కూటమి ద్వారా ఆ రెండు పార్టీలను ఓడిస్తారన్న పూర్తి నమ్మకం తనకు ఉందని కేజ్రీవాల్ అన్నారు. ఇప్పటివరకు బీజేపీ, కాంగ్రెస్‌లలో ఏదో ఒక పార్టీని ఎంచుకోవాల్సిన పరిస్థితిలో ఉన్న గోవా ప్రజలకు ఇప్పుడు ప్రత్యామ్నాయం లభించిందని తెలిపారు.

ప్రజలకు విశ్వసనీయమైన, ఆచరణాత్మకమైన, బలమైన ప్రత్యామ్నాయంగా ‘గోవా ఫస్ట్’ కూటమి నిలుస్తుందని.. గోవా ప్రజల పట్ల నిబద్ధతతో పనిచేస్తూ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుందని అరవింద్ కేజ్రీవాల్ పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

తెలంగాణలో పోలీసులే కాంగ్రెస్ కార్యకర్తల్లా వ్యవహరిస్తున్నారు: కేటీఆర్

ఢిల్లీ: తెలంగాణలో ప్రస్తుతం శాంతిభద్రతల పరిస్థితి దారుణంగా ఉందని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు (కేటీఆర్) ఆరోపించారు. తెలంగాణ...