Saturday, 12 September 2026

ఆస్తులన్నీ అమ్మి.. అన్నదానం చేసిన దంపతులు

 



హనుమకొండకు చెందిన లింగాల కేదారి–పుష్పలత.. సేవా తపనకు నిలువెత్తు నిదర్శనం

హనుమకొండ: ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే జీవిత ధ్యేయంగా భావించిన హనుమకొండకు చెందిన లింగాల కేదారి–పుష్పలత దంపతులు ఎందరికో ఆదర్శంగా నిలిచారు. వేలాది మందికి ఉచితంగా భోజనాలు అందిస్తూ తమ సేవాగుణాన్ని చాటుకున్న ఈ దంపతులు.. దానధర్మాలు, అన్నదాన కార్యక్రమాల కోసం చివరకు తమ ఆస్తులను సైతం విక్రయించారు.

రెడ్డి కాలనీలోని సుమారు రూ.2 కోట్ల విలువైన ఆస్తిని, చోటి మజీద్‌ ప్రాంతంలోని దాదాపు రూ.కోటి విలువైన స్థిరాస్తులను వరుసగా విక్రయించారు. అగ్రంపహాడ్‌, పెంబర్తి సమీపంలో ఉన్న 3.48 ఎకరాల వ్యవసాయ భూములను కూడా అమ్మేశారు. వచ్చిన మొత్తాన్ని స్వార్థ ప్రయోజనాలకు కాకుండా నిరుపేదల ఆకలి తీర్చేందుకు, దానధర్మాలకు వినియోగించారు.

తమ వద్ద ఉన్నదంతా ఇతరుల కోసం ఖర్చు చేసిన ఈ దంపతులు.. చివరకు అత్యంత దీనస్థితిలో కన్నుమూయడం స్థానికులను తీవ్రంగా కలచివేసింది. సొంత ఆస్తులను సైతం త్యాగం చేసి ఆకలితో ఉన్నవారికి అండగా నిలిచిన వారి సేవాభావం హనుమకొండ ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోనుంది.

ఆస్తులు పోయినా.. ఆపన్నులకు అన్నం పెట్టాలనే తపనను మాత్రం వీడని ఈ దంపతుల జీవితం సేవకు నిజమైన నిర్వచనంగా నిలిచింది.

No comments:

Post a Comment

Featured post

ఆస్తులన్నీ అమ్మి.. అన్నదానం చేసిన దంపతులు

  హనుమకొండకు చెందిన లింగాల కేదారి–పుష్పలత.. సేవా తపనకు నిలువెత్తు నిదర్శనం హనుమకొండ: ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడమే జీవిత ధ్యేయంగా భావించ...