రేవంత్‌రెడ్డిపై దాసోజు శ్రవణ్ తీవ్ర విమర్శలు
హైదరాబాద్: బీఆర్‌ఎస్ ఎమ్మెల్సీలు మధు, నవీన్‌రెడ్డి అరెస్టులపై ఆ పార్టీ నేత దాసోజు శ్రవణ్‌కుమార్ తీవ్రంగా స్పందించారు. సీఎం రేవంత్‌రెడ్డి హిట్లర్‌పై తనకున్న అభిమానాన్ని గతంలో వెల్లడించడమే కాకుండా, ఆయన సిద్ధాంతాలు, పాలనా విధానాలను తెలంగాణలో అమలు చేస్తున్నారని ఆరోపించారు.బీఆర్‌ఎస్ నిరసనలను అడ్డుకునేందుకు పోలీసులు, మార్షల్స్, సివిల్ డ్రెస్‌లో ఉన్న గుర్తుతెలియని వ్యక్తులను ప్రభుత్వం ఉపయోగించిందని శ్రవణ్ ఆరోపించారు. నిరసనకారులను అడ్డుకోవడంతోపాటు వారిపై దాడులకు కూడా పాల్పడ్డారని విమర్శించారు.తాతా మధును శాసనమండలి నుంచి బహిష్కరించేలా ప్రభుత్వం కుట్ర చేస్తోందని ఆయన ఆరోపించారు. మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు అనుచితంగా వ్యవహరించారని, వారిని జుట్టు పట్టుకుని లాగడం, చీరలు లాగడం, గొంతు నులిమే ప్రయత్నం చేయడం వంటి ఘటనలు జరిగాయని శ్రవణ్ పేర్కొన్నారు.రేవంత్‌రెడ్డి తెలంగాణ ప్రభుత్వాన్ని హిట్లర్ తరహాలో నడుపుతున్నారని ఆయన విమర్శించారు. ఈ వ్యవహారంపై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ జోక్యం చేసుకోవాలని విజ్ఞప్తి చేశారు.“ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకే ఇలాంటి పరిస్థితి ఎదురైతే.. సామాన్యుడి పరిస్థితి ఏమిటి?” అని దాసోజు శ్రవణ్ ప్రశ్నించారు.
No comments:
Post a Comment