Showing posts with label #TamilNaduResults2026 #VijayTVK #ThalapathyVijay #ChennaiSuperKing #WhistlePodu #TNElectionResults #TVK103Leads #TamilNaduPolitics #VijayStorm. Show all posts
Showing posts with label #TamilNaduResults2026 #VijayTVK #ThalapathyVijay #ChennaiSuperKing #WhistlePodu #TNElectionResults #TVK103Leads #TamilNaduPolitics #VijayStorm. Show all posts

Sunday, 3 May 2026

తమిళనాడు రాజకీయాల్లో 'దళపతి' సునామీ

 




  • 103 స్థానాల్లో టీవీకే ఆధిక్యం
  • చెన్నై సూపర్ కింగ్‌గా అవతరించిన విజయ్

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపులో నటుడు విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించే దిశగా సాగుతున్నారు. తాజా ట్రెండ్స్‌ ప్రకారం, విజయ్ నేతృత్వంలోని టీవీకే ఏకంగా 103 నియోజకవర్గాల్లో ముందంజలో ఉండి రాజకీయ విశ్లేషకులను సైతం విస్మయానికి గురిచేస్తోంది. ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ తరహాలో విజయ్ తన రాజకీయ ఇన్నింగ్స్‌ను మెరుపు వేగంతో ప్రారంభించి, రాష్ట్ర రాజకీయాల్లో అసలైన 'సూపర్ కింగ్‌'గా నిలుస్తున్నారు. ఆయన అభిమానులు 'విజిల్ పోడు' అంటూ సంబరాలు చేసుకుంటుండగా, ఈ ఆధిక్యం ద్రవిడ పార్టీలైన డీఎంకే మరియు అన్నాడీఎంకేల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది. ముఖ్యంగా యువత ,మార్పును ఆశిస్తున్న సామాన్య ఓటర్లు విజయ్‌కు బ్రహ్మరథం పట్టినట్లు ఫలితాలు సూచిస్తున్నాయి. చెన్నై , దాని పరిసర ప్రాంతాల్లోని పట్టణ ఓటర్లు టీవీకే వైపు మొగ్గు చూపడం స్పష్టంగా కనిపిస్తోంది. దశాబ్దాలుగా రాష్ట్ర రాజకీయాలను శాసిస్తున్న ప్రధాన పార్టీలకు సవాల్ విసురుతూ, మూడవ ప్రత్యామ్నాయంగా విజయ్ బలమైన శక్తిగా ఎదిగారు. కేవలం ఓట్లను చీల్చే శక్తిగానే కాకుండా, ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర పోషించే దిశగా టీవీకే అడుగులు వేస్తోంది. ఈ ఫలితాలు తమిళనాడు రాజకీయ ముఖచిత్రాన్ని సమూలంగా మార్చివేసే అవకాశం ఉంది.

Featured post

‘మెయిన్ వాపస్ ఆవుంగా’ ట్రోల్స్‌కు ఆస్కార్ విజేత అదిరిపోయే కౌంటర్!

నెట్టింట వైరల్ అవుతున్న పోస్ట్‌.. రెహమాన్‌కు మద్దతుగా నిలుస్తున్న అభిమానులు! ప్రముఖ దర్శకుడు ఇంతియాజ్ అలీ తెరకెక్కించిన తాజా పీరియడ్ లవ్ స్ట...