Showing posts with label #AbhijitMajumdar #OdishaMusic #OllywoodLoss #RIPAbhijitMajumdar #OdishaNews #MusicLegend. Show all posts
Showing posts with label #AbhijitMajumdar #OdishaMusic #OllywoodLoss #RIPAbhijitMajumdar #OdishaNews #MusicLegend. Show all posts

Monday, 26 January 2026

ఒడియా సంగీత లోకానికి తీరని లోటు


  • ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ అభిజిత్ మజుందార్ కన్నుమూత

ఒడియా చిత్ర పరిశ్రమలో 'హిట్ మెషిన్'గా పేరుగాంచిన ప్రముఖ సంగీత దర్శకుడు, గాయకుడు అభిజిత్ మజుందార్ (54) ఆదివారం కన్నుమూశారు. గత కొంతకాలంగా కాలేయ సంబంధిత వ్యాధులు, ఇతర ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న ఆయన, భువనేశ్వర్‌లోని ఎయిమ్స్ (AIIMS) ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. గతేడాది సెప్టెంబర్ నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్యం శనివారం రాత్రి క్షిణించింది. ఆదివారం ఉదయం గుండెపోటు రావడంతో వైద్యులు చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 1991లో సంబల్ పురి సంగీతంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించిన అభిజిత్, మూడు దశాబ్దాల కెరీర్‌లో 700కు పైగా పాటలకు సంగీతాన్ని అందించారు.



అభిజిత్ మజుందార్ మృతి పట్ల ఒడిశా ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అభిజిత్ మరణం ఒడియా సంగీత, సినీ, సాంస్కృతిక రంగానికి తీరని లోటని ఆయన అన్నారు. తనదైన విశిష్ట శైలితో దశాబ్దాల పాటు లక్షలాది మంది శ్రోతల హృదయాల్లో అభిజిత్ స్థానం సంపాదించుకున్నారని సీఎం పేర్కొన్నారు. కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్, మాజీ ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ సహా పలువురు ప్రముఖులు ఆయనకు ఘన నివాళులర్పించారు. 'లవ్ స్టోరీ', 'సిస్టర్ శ్రీదేవి' వంటి సూపర్ హిట్ చిత్రాలకు ఆయన అందించిన సంగీతం ఎప్పటికీ నిలిచిపోతుందని అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.










Featured post

ఓట్ల తొలగింపుపై అఖిలేశ్ యాదవ్ తీవ్ర ఆగ్రహం.. ఈసీ తీరుపై ప్రశ్నల వర్షం!

  లక్నో: ఓటర్ల జాబితా నుంచి ఓట్లను అక్రమంగా తొలగిస్తున్నారంటూ సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) అధినేత అఖిలేశ్ యాదవ్ ఎన్నికల సంఘం తీరుపై తీవ్రస్థాయి...