Showing posts with label #JanwadaFarmHouse #Janwada #PradeepReddy #KTR #KTRNews #BRS #TelanganaPolitics #TelanganaNews #HyderabadNews #FarmHouseRow #JanwadaFarmHouseLand #LandIssue #PoliticalNews. Show all posts
Showing posts with label #JanwadaFarmHouse #Janwada #PradeepReddy #KTR #KTRNews #BRS #TelanganaPolitics #TelanganaNews #HyderabadNews #FarmHouseRow #JanwadaFarmHouseLand #LandIssue #PoliticalNews. Show all posts

Friday, 18 September 2026

జన్వాడ ఫార్మ్‌హౌస్‌ భూమి నాదే.. కేటీఆర్‌కు సంబంధం లేదు





  • రాజకీయ నేతలు పరిశీలనకు వస్తారన్న వార్తల నేపథ్యంలో యజమాని ప్రదీప్‌రెడ్డి స్పష్టత
  • కేటీఆర్‌ చిన్ననాటి స్నేహితుడు.. ఫార్మ్‌హౌస్‌ను ఆయనకు లీజుకు ఇచ్చానని వెల్లడి
  • భూములకు లీగల్‌గా క్లియర్‌ టైటిల్‌ ఉంది.. అధికారులకు పత్రాలు సమర్పించేందుకు సిద్ధం
  • వ్యక్తిగత ఆస్తిని రాజకీయ నేతలు పరిశీలిస్తామంటూ వివాదం చేయడం సరికాదు: ప్రదీప్‌రెడ్డి


హైదరాబాద్‌, సెప్టెంబర్‌ 18: జన్వాడ ఫార్మ్‌హౌస్‌ భూమిపై యజమాని ప్రదీప్‌రెడ్డి స్పష్టత ఇచ్చారు. ఫార్మ్‌హౌస్‌ ఉన్న భూమి తన సొంతమని, ఆ భూమితో బీఆర్‌ఎస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌కు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. తాను, కేటీఆర్‌ చిన్ననాటి స్నేహితులమని.. అందుకే ఫార్మ్‌హౌస్‌ను ఆయనకు లీజుకు ఇచ్చినట్లు వెల్లడించారు.ఫార్మ్‌హౌస్‌ భూములకు సంబంధించి ఎలాంటి వివాదాలు లేవని ప్రదీప్‌రెడ్డి పేర్కొన్నారు. ఈ భూములకు చట్టబద్ధంగా స్పష్టమైన టైటిల్‌ ఉందని తెలిపారు. ప్రభుత్వానికి లేదా సంబంధిత అధికారులకు ఏవైనా అనుమానాలు ఉంటే తనకు నోటీసులు జారీ చేసి వివరాలు కోరవచ్చన్నారు.ప్రభుత్వ అధికారులు ఏవైనా పత్రాలు కోరితే.. ప్రభుత్వ నిబంధనలు, విధానాల ప్రకారం వాటిని సమర్పించేందుకు తాను సిద్ధంగా ఉన్నట్లు ప్రదీప్‌రెడ్డి తెలిపారు. అయితే రాజకీయ నేతలు వచ్చి వ్యక్తిగత ఆస్తిని పరిశీలిస్తామంటూ వివాదానికి తెరతీయడం సరికాదని ఆయన అభిప్రాయపడ్డారు.రాజకీయ నాయకులు జన్వాడ ఫార్మ్‌హౌస్‌ను పరిశీలించనున్నారన్న వార్తల నేపథ్యంలో ప్రదీప్‌రెడ్డి ఈ వివరణ ఇచ్చారు.

Featured post

హైకోర్టు తీర్పుపై సుప్రీంకోర్టులో సవాల్

దానం నాగేందర్ సంచలన నిర్ణయం హైదరాబాద్:తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. పార్టీ ఫిరాయింపుల వ్యవహారంలో తనపై అనర్హత వేటు వేస్...