అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో గురువారం జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో 70.72 శాతం పోలింగ్ నమోదైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగిన పోలింగ్‌కు సంబంధించిన తుది గణాంకాలను శుక్రవారం వెల్లడించింది.
విశాఖ జిల్లాలో నాలుగు జడ్పీటీసీ స్థానాలకు ఎన్నికలు జరగ్గా అత్యధికంగా 82.51 శాతం పోలింగ్ నమోదైంది. అల్లూరి జిల్లాలో అత్యల్పంగా 62.01 శాతం ఓట్లు పోలయ్యాయి. శ్రీకాకుళంలో 65.51 శాతం, అనకాపల్లిలో 75.58 శాతం, అనంతపురంలో 64.38 శాతం, అన్నమయ్య జిల్లాలో 69.19 శాతం, చిత్తూరులో 76.30 శాతం పోలింగ్ నమోదైంది.
అదేవిధంగా బాపట్ల జిల్లాలో 67.47 శాతం, కృష్ణా జిల్లాలో 73.21 శాతం, కోనసీమ జిల్లాలో 66.33 శాతం ఓట్లు పోలైనట్లు ఎన్నికల అధికారులు వెల్లడించారు. రాష్ట్రవ్యాప్తంగా నమోదైన 70.72 శాతం పోలింగ్‌తో అభ్యర్థుల గెలుపోటములపై ఉత్కంఠ నెలకొంది.

No comments:
Post a Comment