2026 టీ20 క్రికెట్ ప్రపంచకప్ విజేత భారత జట్టు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్‌ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆత్మీయంగా కలుసుకున్నారు. సూర్యకుమార్ యాదవ్‌తో పాటు ఆయన కుటుంబ సభ్యులతోనూ ప్రధాని ప్రత్యేకంగా సమావేశమయ్యారు.
ఈ సందర్భంగా ప్రధాని మోదీ చూపించిన ఆప్యాయత, ప్రేమాభిమానాలు సూర్యకుమార్ యాదవ్‌కు, ఆయన కుటుంబ సభ్యులకు ఎంతో ప్రత్యేకమైన అనుభూతిని మిగిల్చాయి. ఎన్నో ఏళ్ల కఠోర శ్రమ, పట్టుదల, అంకితభావంతో సాధించిన విజయానికి ప్రధానమంత్రి నుంచి లభించిన ఈ ప్రేమపూర్వక అభినందన ఒక మధురమైన జ్ఞాపకంగా నిలిచిపోనుంది.

No comments:
Post a Comment