చెన్నైలోని లీలా ప్యాలెస్ హోటల్‌లో జరిగిన శ్రేయ, ఉజ్వల్ వివాహ వేడుకకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, తమిళనాడు ముఖ్యమంత్రి సి. జోసెఫ్ విజయ్, పారిశ్రామికవేత్త గౌతమ్ అదానీ, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తదితరులు నూతన వధూవరులను ఆశీర్వదించారు.
శ్రేయ.. వైఎస్ అనిల్‌రెడ్డి కుమార్తె. జగన్ తన భార్య వైఎస్ భారతితో కలిసి వివాహ వేడుకకు హాజరయ్యారు. వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలిగా వ్యవహరించిన వైఎస్ విజయమ్మ కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజకీయ, వ్యాపార రంగాలకు చెందిన ప్రముఖులతోపాటు కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఈ వేడుకకు హాజరయ్యారు.
జగన్, భారతి నూతన దంపతులను ఆశీర్వదించి, వారి వైవాహిక జీవితం సుఖసంతోషాలు, సిరిసంపదలతో సాగాలని ఆకాంక్షించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు, అతిథులతో వారు కొద్దిసేపు ముచ్చటించారు.




No comments:
Post a Comment