Friday, 6 November 2026

పరిషత్‌ ఎన్నికల కౌంటింగ్‌కు భారీ ఏర్పాట్లు.. 28 జిల్లాల్లో 365 కేంద్రాలు



అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో పోటీ చేసిన వేలాది మంది అభ్యర్థుల భవితవ్యం మరికొద్ది గంటల్లో తేలనుంది. ఓట్ల లెక్కింపును పారదర్శకంగా, ప్రశాంతంగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఆధ్వర్యంలో అధికారులు విస్తృత ఏర్పాట్లు చేశారు. రాష్ట్రవ్యాప్తంగా 28 జిల్లాల్లో మొత్తం 365 కౌంటింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు.

ఈ ప్రక్రియలో 30 వేల మందికి పైగా సిబ్బంది ప్రత్యక్షంగా పాల్గొననున్నారు. వీరిలో 11 వేలకు పైగా కౌంటింగ్‌ సూపర్‌వైజర్లు, 28,500 మంది కౌంటింగ్‌ సిబ్బంది, సహాయకులు ఉన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా భారీగా పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.ఉదయం 8 గంటలకు పోస్టల్‌ బ్యాలెట్ల లెక్కింపుతో ప్రక్రియ ప్రారంభమవుతుంది. తొలి ఫలితం వెలువడటానికి కనీసం నాలుగు గంటల సమయం పట్టవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు.

ఈ నెల 5న జరిగిన ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా 70.72 శాతం పోలింగ్‌ నమోదైంది. వరదలు, భారీ వర్షాల కారణంగా వాయిదా పడిన ఐదు మండలాల్లో గురువారం పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసింది. మరో మూడు జిల్లాల్లో వివిధ కారణాలతో తిరిగి పోలింగ్‌ నిర్వహించాలని రాష్ట్ర ఎన్నికల సంఘం నిర్ణయించింది. ఆయా ప్రాంతాల్లో కూడా సాయంత్రం 5 గంటలకు పోలింగ్‌ ముగిసింది.

No comments:

Post a Comment

Featured post

వైద్యుడిపై దాడి కేసులో ట్విస్ట్‌.. నటిపై బంధువు అత్యాచార ఆరోపణలు!

  కొచ్చి: వైద్యం పేరుతో ఓ వైద్యుడిని ఫ్లాట్‌కు పిలిపించి దాడి చేసి, ఆయన వద్ద నుంచి రూ.3.5 లక్షల విలువైన వస్తువులు దోచుకున్నారనే ఆరోపణలతో నమో...