హైదరాబాద్: అసెంబ్లీ వద్ద తన తల్లితో పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారని పట్లోళ్ల కార్తీక్‌రెడ్డి ఆరోపించారు. సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశాలతోనే పోలీసులు అలా వ్యవహరించారని ఆరోపిస్తూ తీవ్రంగా మండిపడ్డారు. “అలా చేస్తే మేము భయపడతామని రేవంత్‌రెడ్డి అనుకుంటున్నారు. నేను ఇంద్రారెడ్డి కొడుకును.. ఆమె ఇంద్రారెడ్డి భార్య. మా వ్యవస్థలో భయం పెట్టడం తప్ప.. భయపడటం ఉండదు” అని కార్తీక్‌రెడ్డి వ్యాఖ్యానించారు. రేవంత్‌రెడ్డి తమ కుటుంబ చరిత్రను మర్చిపోయినట్లున్నారని అన్నారు. తన తండ్రి ఇంద్రారెడ్డి నక్సలైట్ల ఉద్యమం నుంచి రాజకీయాల్లోకి వచ్చారని గుర్తుచేశారు. పోలీసులు ఎన్‌కౌంటర్‌కు తీసుకెళ్లే పరిస్థితులు వచ్చినా భయపడలేదని, ఇప్పుడు పోలీసుల చర్యలకు భయపడతామా? అని ప్రశ్నించారు. ఇంద్రారెడ్డి హోంమంత్రి పదవి కోల్పోయినప్పుడు, అనంతరం చంద్రబాబు అక్రమంగా జైలులో పెట్టిన సమయంలోనూ తమ కుటుంబం భయపడలేదని కార్తీక్‌రెడ్డి పేర్కొన్నారు. ఇంద్రారెడ్డి మృతి చెందిన సమయంలో తన వెంట ఎవరూ లేకపోయినా తన తల్లి ఒంటరిగా రాజకీయాల్లోకి వచ్చారని, అప్పుడే భయపడలేదని అన్నారు. “నేను కానీ, నా కార్యకర్తలు కానీ, ఇంద్రారెడ్డి అభిమానులు కానీ ఒక్క చుక్క కూడా భయపడం. రెండింతలు తిరిగి కొట్లాడతాం” అని కార్తీక్‌రెడ్డి స్పష్టం చేశారు.
Showing posts with label #KarthikReddy #RevanthReddy #IndraReddy #TelanganaPolitics #Congress #TelanganaAssembly. Show all posts
Showing posts with label #KarthikReddy #RevanthReddy #IndraReddy #TelanganaPolitics #Congress #TelanganaAssembly. Show all posts
Tuesday, 8 September 2026
Subscribe to:
Posts (Atom)
Featured post
బాక్సాఫీస్ వద్ద రికార్డులు సృష్టిస్తున్న సూపర్‌స్టార్ రజినీకాంత్ 'జైలర్ 2'
ప్రపంచవ్యాప్తంగా రూ. 666 కోట్లకు పైగా వసూళ్లు న్యూఢిల్లీ: సూపర్‌స్టార్ రజినీకాంత్ ప్రధాన పాత్రలో నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో తెరకెక్క...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
సెప్టెంబర్ 5 ఉపాధ్యాయ దినోత్సవం అనగానే మా రాసకట్ట శంకర్ సార్ గుర్తుకు వస్తారు. ఆసరి రాజు లాంటి వందలాది మందికి అక్షర జ్ఞానం నేర్పించిన గుర...
