Sunday, 11 October 2026

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది

  •  ఢిల్లీలో నిరసనకారులపై భారీగా పోలీసు బలగాలను మోహరించడమే దీనికి నిదర్శనం
  • మండిపడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే 


బెంగళూరు: ప్రధాన ఎన్నికల కమిషనర్ (CEC) తీరును నిరసిస్తూ, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం తాము చేస్తున్న పోరాటంలో భాగంగా త్వరలో భారత ప్రధానన్యాయమూర్తిని (CJI) కలవనున్నట్లు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే వెల్లడించారు. బెంగళూరులో మీడియాతో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సీజేఐని కలవనున్న కాంగ్రెస్ అగ్రనేతలు: దేశంలో నెలకొన్న పరిస్థితులపై సీజేఐకి వివరించేందుకు తాము అపాయింట్‌మెంట్ కోరామని, తాను మరియు రాహుల్ గాంధీ వేర్వేరుగా లేఖలు రాశామని తెలిపారు. సాయంత్రం 4 నుంచి 5 గంటల మధ్య సమయం కేటాయించాల్సిందిగా సీజేఐని కోరతామని, తాము ఎలాంటి డిమాండ్లు చేయబోమని, కేవలం వినయపూర్వకంగా వివరిస్తామని స్పష్టం చేశారు. అప్రకటిత ఎమర్జెన్సీ: దేశంలో ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాలు కలిసి అరాచకం సృష్టిస్తున్నారని, దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీని అమలు చేస్తున్నారని ఆరోపించారు. ఈ నియంతృత్వ పోకడలకే వ్యతిరేకంగా తాము పోరాటం చేస్తున్నామని చెప్పారు. భారీ పోలీసుల మోహరింపుపై విమర్శలు: ఇటీవల ఢిల్లీ నిరసనల సమయంలో సుమారు 32 వేల మంది పోలీసులను మోహరించారని, ప్రభుత్వాన్ని ఎంతగా భయం పట్టుకుందో దీని బట్టి స్పష్టమవుతోందని ఖర్గే ఎద్దేవా చేశారు.

No comments:

Post a Comment

Featured post

దేశంలో అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోంది

 ఢిల్లీలో నిరసనకారులపై భారీగా పోలీసు బలగాలను మోహరించడమే దీనికి నిదర్శనం మండిపడిన కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే  బెంగళూరు: ప్...