Saturday, 15 August 2026

నెహ్రూ నుంచి ఇందిర వరకు

 

  • దేశ నిర్మాణంలో కాంగ్రెస్‌ నేతల పాత్రను గుర్తుచేసిన ఖర్గే



న్యూఢిల్లీ: ఆధునిక, ప్రజాస్వామ్య, లౌకిక భారతదేశానికి పునాదులు వేసింది మాజీ ప్రధాని జవహర్‌లాల్‌ నెహ్రూ అని కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే అన్నారు. నెహ్రూ హయాంలో ఐఐటీలు, ఐఐఎంలు, ప్రభుత్వ రంగ సంస్థలు ఏర్పాటయ్యాయని, దేశ నిర్మాణానికి ఆయన ఎంతో కృషి చేశారని పేర్కొన్నారు. అయితే ఆయనకు ఎలాంటి అహంకారం ఉండేది కాదని వ్యాఖ్యానించారు. మాజీ ప్రధాని లాల్‌బహదూర్‌ శాస్త్రి దేశంలో శ్వేత, హరిత విప్లవాలకు పునాదులను బలోపేతం చేశారని ఖర్గే తెలిపారు. ఇందిరాగాంధీ భారత సైనిక, వ్యూహాత్మక సామర్థ్యాలను మరింత పటిష్ఠం చేయడంతో పాటు బంగ్లాదేశ్‌ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని గుర్తుచేశారు. సిక్కింను భారత్‌లో విలీనం చేయడం కూడా కాంగ్రెస్‌ నేతల పాలనలోనే జరిగిందన్నారు. కాంగ్రెస్‌ నేతలు దేశ నిర్మాణానికి చేసిన కృషిని ప్రస్తావించిన ఖర్గే.. ఎర్రకోట నుంచి ప్రసంగించే కొందరు మాత్రం దేశం కోసం తామే అన్నీ చేశామని చెప్పుకుంటున్నారని విమర్శించారు. ప్రపంచంలో మిగిలి ఉన్నదంతా తమ వల్లే సాధ్యమైందని వారు చెప్పుకోకపోవడం ఒక్కటే ఉపశమనమని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

No comments:

Post a Comment

Featured post

వందేమాతరం వివాదంపై కాంగ్రెస్‌ వివరణ

ఖర్గేకు కుర్చీ కోసమే సోనియా ఆదేశాలు: తారిఖ్‌ అన్వర్‌ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం ఆలాపనపై ఎలాంటి వివాదం జరగలేదని కాంగ...