- నా వ్యాఖ్యల్లో తప్పేముంది: కంగనా రనౌత్
జెన్ జీపై తాను చేసిన వ్యాఖ్యలను బీజేపీ ఎంపీ, నటి కంగనా రనౌత్ సమర్థించుకున్నారు. తన వ్యాఖ్యలు దేశంలోని యువత మొత్తాన్ని ఉద్దేశించి చేసినవి కాదని, కొందరు వ్యక్తులను మాత్రమే ఉద్దేశించి మాట్లాడినట్లు ఆమె స్పష్టం చేశారు. తమను తాము ‘బొద్దింకలు’గా అభివర్ణించుకునే వారినే తాను ఉద్దేశించానని పేర్కొన్నారు.
‘‘తమను తాము బొద్దింకలు అని చెప్పుకునే వారి గురించే నేను మాట్లాడాను. బొద్దింకలు మురికి కాలువల నుంచే వస్తాయి కదా. అలాంటప్పుడు నేను అన్నదాంట్లో తప్పేముంది? కొందరు తమను తాము బొద్దింకలుగా చెప్పుకుంటుంటే.. మురికి కాలువే వారి ఇల్లు అని మనం అంటే వారు ఎందుకు బాధపడాలి? నేను యువత మొత్తాన్ని ఉద్దేశించి ఆ వ్యాఖ్యలు చేశానని చెప్పడం సరికాదు’’ అని కంగనా అన్నారు.
నీట్-యూజీ పేపర్ లీక్ వ్యవహారంపై జెన్ జీ నిరసనకారులకు సంబంధించిన వీడియోలపై స్పందిస్తూ కంగనా గతంలో తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జెన్ జీని ‘గట్టర్ జనరేషన్’గా అభివర్ణిస్తూ.. నిరసనలకు సంబంధించిన రీల్స్ చూస్తే వాంతులు వచ్చేలా ఉన్నాయని, వారు మాట్లాడే తీరు, ఉపయోగించే భాష తనను తీవ్రంగా విసిగించాయని సోషల్ మీడియాలో విమర్శించారు.
No comments:
Post a Comment