Tuesday, 18 August 2026

హర్మూజ్‌.. అమెరికాలో కొత్త ప్రదేశం

 

మ్యాప్‌ ఫొటోతో ట్రంప్‌ సంచలన పోస్ట్‌



హర్మూజ్‌ జలసంధిపై తమకు పూర్తి నియంత్రణ ఉందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్‌ ట్రంప్‌ మరోసారి స్పష్టం చేశారు. ఈ మేరకు ఆయన ‘ట్రూత్‌ సోషల్‌’ వేదికగా ఓ ఆసక్తికరమైన ఫొటోను షేర్‌ చేశారు. హర్మూజ్‌ జలసంధి మ్యాప్‌పై ‘హర్మూజ్‌.. అమెరికా కొత్త ప్రదేశం’ అని రాసి ఉన్న చిత్రాన్ని ఆయన పోస్టు చేశారు. ప్రస్తుతం హర్మూజ్‌ జలసంధిపై అమెరికా దిగ్బంధనం కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్‌ చేసిన ఈ పోస్ట్‌ ప్రాధాన్యం సంతరించుకుంది. ఇరాన్‌కు చెందిన నౌకలను అమెరికా అడ్డుకుంటున్నట్లు సమాచారం.


మరోవైపు, తమ డిమాండ్లు నెరవేరే వరకు హర్మూజ్‌ జలసంధిపై నియంత్రణను కొనసాగిస్తామని ఇరాన్‌ పార్లమెంటరీ స్పీకర్‌ మహమ్మద్‌ బాఘేర్‌ గాలిబాఫ్‌ స్పష్టం చేశారు. ఒప్పందం ప్రకారం దిగ్బంధనాన్ని ఎత్తివేయడంతో పాటు స్తంభింపజేసిన ఆస్తులను విడుదల చేయాలని, చమురుపై విధించిన ఆంక్షలను తొలగించాలని ఇరాన్‌ డిమాండ్‌ చేస్తోంది. అంతేకాకుండా సైనిక చర్యలకు పూర్తిగా ముగింపు పలకాలని కోరుతోంది. ఈ డిమాండ్లు నెరవేరే వరకు హర్మూజ్‌ జలసంధిని తిరిగి తెరిచే ప్రసక్తే లేదని గాలిబాఫ్‌ తేల్చిచెప్పారు. దీంతో హర్మూజ్‌ జలసంధిపై అమెరికా, ఇరాన్‌ మధ్య ఉద్రిక్తతలు మరింత తీవ్రరూపం దాల్చే పరిస్థితి కనిపిస్తోంది.

No comments:

Post a Comment

Featured post

మీ ధైర్యం ఎన్నో ప్రాణాలను కాపాడింది

ఫ్లై దుబాయ్‌ కెప్టెన్‌తో మోడీ వీడియో కాల్‌ న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్‌ విమాన కెప్టెన్‌ స్మిత్‌ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్‌లో మా...