Thursday, 20 August 2026

పార్టీ క్రమశిక్షణకు విరుద్ధంగా బహిరంగ వ్యాఖ్యలు చేస్తే చర్యలు



  • కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌


హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డిపై చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో కాంగ్రెస్‌ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్‌ స్పందించారు. కాంగ్రెస్‌ పార్టీలో ప్రతి నాయకుడు, ఎంతటి స్థాయిలో ఉన్నా పార్టీ నిర్దేశించిన హద్దుల్లోనే ఉండాలనే క్రమశిక్షణ ఉందని ఆయన స్పష్టం చేశారు. పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించే చర్యలకు పాల్పడితే సంబంధిత నేతలకు షోకాజ్‌ నోటీసులు జారీ చేసి వివరణ కోరుతామని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ తెలిపారు. పార్టీకి వ్యతిరేకంగా జరిగే కార్యకలాపాలను ఏమాత్రం ఉపేక్షించబోమని పేర్కొన్నారు. ఏదైనా సమస్య ఉంటే పార్టీ అంతర్గత వేదికలపై వ్యక్తిగతంగా నిరసన లేదా అభ్యంతరం వ్యక్తం చేయాలని సూచించారు. అయితే, బహిరంగంగా పార్టీపై అసమ్మతిని వ్యక్తం చేయడం సరికాదని, ఇలాంటి చర్యలను కాంగ్రెస్‌ తీవ్రంగా ఖండిస్తుందని అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అన్నారు.

No comments:

Post a Comment

Featured post

పాస్‌పోర్ట్‌ వ్యవస్థపై పార్లమెంటరీ కమిటీ విస్తృత చర్చ

చట్ట సవరణపై సిఫారసులు: శశి థరూర్‌  న్యూఢిల్లీ: పాస్‌పోర్ట్‌ వ్యవస్థ, ఈ-పాస్‌పోర్ట్‌ విధానం, పోలీసు వెరిఫికేషన్‌, పౌరసత్వ అంశాలు, పాస్‌పోర్ట్...