Tuesday, 4 August 2026

ప్రజారోగ్య మౌలిక వసతులకు రూ.32,961 కోట్ల ఆమోదం

 


ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ హెల్త్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ మిషన్ (PM-ABHIM) కింద దేశవ్యాప్తంగా ప్రజారోగ్య మౌలిక వసతుల బలోపేతానికి రూ.32,961 కోట్ల పరిపాలనా అనుమతులు మంజూరు చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్‌రావు జాధవ్ రాజ్యసభలో తెలిపారు. 11 వేల సబ్ హెల్త్ సెంటర్లు, 5,456 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, 2,151 బ్లాక్ పబ్లిక్ హెల్త్ యూనిట్లు, 744 ప్రజారోగ్య ప్రయోగశాలలు, 631 క్రిటికల్ కేర్ బ్లాకుల నిర్మాణానికి ఆమోదాలు ఇచ్చినట్లు వెల్లడించారు. తెలంగాణలోని ఎయిమ్స్ బీబీనగర్ పొరుగు రాష్ట్రాలకు కూడా తృతీయ స్థాయి వైద్య సేవలు అందిస్తున్న కీలక సంస్థగా పనిచేస్తోందని పేర్కొన్నారు.

No comments:

Post a Comment

Featured post

ఇన్స్యూరెన్స్ లేకపోతే ఇంధనం కట్

కేంద్రానికి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు తదుపరి విచారణ ఆగస్టు 18కు వాయిదా  దేశంలో చెల్లుబాటయ్యే మోటార్ వాహన బీమా (ఇన్సూరెన్స్) లేకుండా కోట్లాద...