న్యూఢిల్లీ: 2025 సంవత్సరానికి జాతీయ క్రీడా పురస్కారాలను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈసారి అత్యున్నత క్రీడా పురస్కారం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్నను ఎవరికి ప్రకటించలేదు. 17 మంది క్రీడాకారులకు అర్జున అవార్డులు దక్కాయి. అథ్లెటిక్స్‌లో తేజస్విన్ శంకర్, మహమ్మద్ అజ్మల్, ప్రియాంక గోస్వామి, బ్యాడ్మింటన్‌లో ట్రీసా జాలీ, గాయత్రి గోపీచంద్, చెస్‌లో విదిత్ గుజరాతి, దివ్యా దేశ్‌ముఖ్ సహా పలువురు ఈ పురస్కారానికి ఎంపికయ్యారు. హాకీలో లాల్‌రెమ్సియామి, రాజ్‌కుమార్ పాల్, కబడ్డీలో సుర్జీత్, పూజ, షూటింగ్‌లో అఖిల్ షియోరాన్, పారా షూటింగ్‌లో ధనుష్ శ్రీకాంత్, రుద్రాంశ్ ఖండేల్వాల్, రోయింగ్‌లో అరవింద్ సింగ్ తదితరులు అవార్డులు అందుకోనున్నారు. ఫుట్‌బాల్‌లో అరుమై నాయగానికి అర్జున అవార్డు (లైఫ్‌టైమ్) లభించింది. పలువురు కోచ్‌లకు ద్రోణాచార్య అవార్డులు ప్రకటించారు.
Subscribe to:
Post Comments (Atom)
Featured post
మీ ధైర్యం ఎన్నో ప్రాణాలను కాపాడింది
ఫ్లై దుబాయ్ కెప్టెన్‌తో మోడీ వీడియో కాల్ న్యూఢిల్లీ: ఫ్లై దుబాయ్ విమాన కెప్టెన్ స్మిత్ మచ్ఛర్‌తో ప్రధాని నరేంద్ర మోడీ వీడియో కాల్‌లో మా...
-
దేశవ్యాప్త నిరసనలకు పిలుపు వెనిజులా అధ్యక్షుడు నికోలస్ మాదురోను అమెరికా దళాలు బంధించడాన్ని భారతదేశంలోని వామపక్ష పార్టీలు (CPI, CPI(M), ఫార...
-
అలీ ఖమేనీ మృతితో రగిలిపోతున్న ఇరాన్ ఇజ్రాయెల్‌కు లరిజానీ భయంకర హెచ్చరిక! టెహ్రాన్: ఇరాన్ సుప్రీం లీడర్ అయాతొల్లా అలీ ఖమేనీ మరణంతో పశ్చిమ...
-
శ్రీవాణిని కేతన్ హైస్కూల్ లో పదవ తరగతి సమయంలో పొద్దున మాకు ట్యూషన్స్ ఉండేవి. ప్రభాకర్ రెడ్డి సార్ (మాథ్య్స్) , సీతారామరావు సార్ (సోష...
No comments:
Post a Comment