Saturday, 15 August 2026

రాష్ట్రంలో కరువు రావాలని అఘోర పూజలా?




  •   ప్రతిపక్ష నేతలపై సీఎం రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు

రాష్ట్రంలో కరువు రావాలని, రైతులు చనిపోవాలని, ప్రభుత్వం పడిపోవాలని కోరుకుంటూ కొందరు మాజీ మంత్రులు ఇతర రాష్ట్రాలకు వెళ్లి అర్ధరాత్రి అఘోర పూజలు, చేతబడి చేయిస్తున్నారని ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి సంచలన ఆరోపణలు చేశారు. పదేళ్ల పాటు మంత్రులుగా పనిచేసిన వ్యక్తులు ఇలాంటి చర్యలకు పాల్పడటం ఏమిటని ఆయన ప్రశ్నించారు.

“మనిషన్న వాడు ఎవడైనా ఇలాంటి పనులు చేస్తాడా?” అని సీఎం వ్యాఖ్యానించారు. తనపై లేదా టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌ గౌడ్‌పై చేతబడి చేయిస్తే తాము ఎదుర్కొంటామని, కానీ ప్రజలకు నష్టం జరగాలని కోరుతూ చేతబడి పూజలు చేయించడం ఏమిటని ప్రశ్నించారు.

బాత్రూమ్‌కు వెళ్లిన విషయాన్ని కూడా సోషల్‌ మీడియాలో పోస్టులు చేసే వారు.. ఇతర రాష్ట్రాలకు వెళ్లి ప్రజల మంచి కోసం పూజలు చేశామని చెబుతున్నప్పుడు వాటిని ఎందుకు సోషల్‌ మీడియాలో పెట్టలేదని రేవంత్‌ రెడ్డి ప్రశ్నించారు. ప్రజల సంక్షేమానికి వ్యతిరేకంగా ఎవరైనా ఇలాంటి చర్యలకు పాల్పడితే ప్రజలే తగిన సమాధానం చెబుతారని ఆయన అన్నారు.

No comments:

Post a Comment

Featured post

వందేమాతరం వివాదంపై కాంగ్రెస్‌ వివరణ

ఖర్గేకు కుర్చీ కోసమే సోనియా ఆదేశాలు: తారిఖ్‌ అన్వర్‌ న్యూఢిల్లీ: కాంగ్రెస్‌ ప్రధాన కార్యాలయంలో వందేమాతరం ఆలాపనపై ఎలాంటి వివాదం జరగలేదని కాంగ...