పార్లమెంట్ వర్షాకాల సమావేశాల చివరి రోజున రాజ్యసభలో తీవ్ర గందరగోళం నెలకొంది. ఉత్తరాఖండ్‌లో తాను పాల్గొన్న ర్యాలీ వేదిక వద్ద తన ప్రసంగం అనంతరం శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించారని ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే ఆరోపించారు. ఈ ఘటనపై ఆయన సభలో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. తాను ర్యాలీలో ఏ వర్గాన్ని, మతాన్ని ప్రస్తావించకుండా ప్రజా సమస్యలపైనే మాట్లాడానని తెలిపారు. అయినప్పటికీ తన ప్రసంగం తర్వాత శుద్ధీకరణ కార్యక్రమం నిర్వహించడం ప్రజాస్వామ్యంలో ఆమోదయోగ్యం కాదని అన్నారు. ఈ ఘటన వెనుక బీజేపీ కార్యకర్తలు ఉన్నారని ఖర్గే ఆరోపించగా, కాంగ్రెస్ ఎంపీలు ఆయనకు మద్దతుగా నినాదాలు చేశారు.
కేంద్ర మంత్రి జేపీ నడ్డా స్పందిస్తూ ఈ ఘటన దురదృష్టకరమని అన్నారు. ఇలాంటి చర్యలను బీజేపీ ఏమాత్రం సమర్థించదని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంతో పార్టీకి ఎలాంటి సంబంధం లేదని, ఘటనపై దర్యాప్తు జరిపిస్తామని తెలిపారు.
No comments:
Post a Comment