Wednesday, 12 August 2026

మెట్రో ప్రయాణికులకు షాక్‌

  •  పాస్‌లకు ఎల్‌అండ్‌టీ విముఖత!

హైదరాబాద్‌ మెట్రోలో రోజువారీ, నెలవారీ పాస్‌లను ప్రవేశపెట్టాలన్న ప్రయాణికుల డిమాండ్‌కు మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. ప్రస్తుత మెట్రో నెట్‌వర్క్‌లో పాస్‌లను ప్రవేశపెట్టేందుకు ఎల్‌అండ్‌టీ హైదరాబాద్‌ మెట్రోరైలు సంస్థ సుముఖంగా లేదని తెలుస్తోంది.



మెట్రో ప్రారంభమైనప్పటి నుంచీ ప్రయాణికులు రోజువారీ, నెలవారీ పాస్‌ల కోసం డిమాండ్‌ చేస్తున్నారు. ఈ అంశాన్ని మెట్రో అధికారులు పలుమార్లు ఎల్‌అండ్‌టీ దృష్టికి తీసుకెళ్లినా సంస్థ నుంచి సానుకూల స్పందన రాలేదు. గత నెలాఖరులో జరిగిన హైదరాబాద్‌ మెట్రోరైలు లిమిటెడ్‌ బోర్డు సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, హెచ్‌ఎంఆర్‌ఎల్‌ ఛైర్మన్‌ సంజయ్‌ జాజు పాస్‌లను ప్రవేశపెట్టే అవకాశాలను పరిశీలించాలని అధికారులను ఆదేశించారు. అధికారులు ఎల్‌అండ్‌టీ మెట్రోతో చర్చించగా.. సంస్థ విముఖత వ్యక్తం చేసినట్లు సమాచారం.

పాస్‌ల అంశంపై గురువారం జరిగే మెట్రోరైలు బోర్డు సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. బోర్డు నిర్ణయానికి అనుగుణంగా తదుపరి చర్యలు తీసుకోనున్నారు. మెట్రో, ఆర్టీసీలో ఉమ్మడి టికెట్‌, పాస్‌ల అంశంపై గతవారం ఆర్టీసీ అధికారులతో జరిగిన సమావేశం పురోగతిని కూడా సీఎస్‌ సమీక్షించే అవకాశం ఉంది. మెట్రో తొలి దశకు సంబంధించిన రుణ సమీకరణ, ఎన్‌బీఐ క్యాప్స్‌ 45 రోజుల్లో ప్రక్రియ పూర్తి చేసే అంశం, రెండో దశ అనుమతులు తదితర అంశాలపైనా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది.

No comments:

Post a Comment

Featured post

ఆసియా క్రీడలు 2026: మహిళల 4x400 మీటర్ల రిలేలో భారత్‌కు స్వర్ణం

నాగోయా: జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్‌ ఈరోజు మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. భారత జట్టు 3 నిమిషాల 29.69 స...