Thursday, 13 August 2026

సైనిక హెలికాప్టర్‌ కూలి భారీ కార్చిచ్చు



  • ఇద్దరు సైనికులు మృతి

అమెరికాలోని టెక్సాస్‌లో సైనిక హెలికాప్టర్‌ కూలిపోవడంతో భారీ కార్చిచ్చు చెలరేగింది. సాలడో పట్టణం సమీపంలోని ఓ పొలంలో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. హెలికాప్టర్‌ కూలిన వెంటనే మంటలు వేగంగా వ్యాపించి వందల ఎకరాల్లోని గడ్డి దగ్ధమైంది. దీంతో సమీప ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఈ ప్రమాదంలో హెలికాప్టర్‌లో ఉన్న ఇద్దరు సైనికులు మృతి చెందారు.

ప్రమాదానికి గురైనది ఏహెచ్‌-64 అపాచీ అటాక్‌ హెలికాప్టర్‌ అని ఫోర్ట్‌ హుడ్‌ సైనిక స్థావరం వెల్లడించింది. అగ్నిమాపక సిబ్బంది వెంటనే రంగంలోకి దిగి మంటలను అదుపులోకి తెచ్చే ప్రయత్నం చేశారు. బుధవారం సాయంత్రానికి కార్చిచ్చును 50 శాతం వరకు అదుపులోకి తెచ్చినట్లు టెక్సాస్‌ అగ్నిమాపక అధికారులు తెలిపారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది.

No comments:

Post a Comment

Featured post

ఆసియా క్రీడలు 2026: మహిళల 4x400 మీటర్ల రిలేలో భారత్‌కు స్వర్ణం

నాగోయా: జపాన్‌లో జరుగుతున్న ఆసియా క్రీడలు 2026లో భారత్‌ ఈరోజు మహిళల 4x400 మీటర్ల రిలేలో స్వర్ణ పతకం సాధించింది. భారత జట్టు 3 నిమిషాల 29.69 స...